Wednesday, March 19, 2025

తిరుమలలో కానరాని క్రమశిక్షణ.. ఉద్యోగిపై ట్రస్ట్ బోర్డు సభ్యుడు తిట్ల దండకం!

- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ వివాదాలు పెరుగుతున్నాయి. వరుసగా జరుగుతున్న పరిణామాలు భక్తులను కలచివేస్తున్నాయి. మొన్న ఆ మధ్యన లడ్డు వివాదం కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. అటు తర్వాత జరిగిన తుగ్గిసలాట తిరుమల చరిత్రలోనే విషాదాన్ని నింపింది. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సింది పోయి.. మరిన్ని వివాదాలకు అవకాశం కల్పిస్తోంది టీటీడీ ట్రస్ట్ బోర్డు. ఇన్ని రకాల పరిణామాలు జరిగిన ఎటువంటి ప్రాయశ్చిత్త చర్యలు కనిపించడం లేదు. ఏపీ సీఎం చంద్రబాబు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. తిరుమలలో రాజకీయాలు ఉండవని కూడా పెద్దపెద్ద మాటలు చెప్పారు. కానీ తిరుమలలో జరుగుతున్న పరిణామాలు మాత్రం సగటు భక్తుడుని కలచివేస్తున్నాయి.

తాజాగా తిరుమలలో ఓ ఘటన వెలుగు చూసింది. అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది. టీటీడీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిపై టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు తిట్ల దండకాన్ని అందుకున్నాడు. బూతులతో రెచ్చిపోయాడు. నిబంధనల ప్రకారం క్యూ లైన్ లో వెళ్లాలని సదరు ఉద్యోగి చెప్పడమే.. ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఆగ్రహానికి కారణం.

తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చాలా రకాల నిబంధనలు తెరపైకి తెచ్చారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు సమావేశంలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఇది సదరు సభ్యుడికి తెలుసు. ఇప్పుడు అలానే లోపలికి వెళ్లాలని చెప్పిన పాపానికి బాలాజీ అనే టీటీడీ ఉద్యోగిపై తిట్ల దండకాన్ని అందుకున్నారు సభ్యుడు నరేష్ కుమార్. థర్డ్ క్లాస్ నా కొడకా అంటూ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే బూతులు మాట్లాడారు. బయటకు వెళ్ళిపోరా అంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. వందలాదిమంది భక్తుల సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో బాధిత ఉద్యోగి నొచ్చుకున్నారు. టీటీడీ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీసేలా ట్రస్టు బోర్డు సభ్యులు వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

టీటీడీ ట్రస్ట్ బోర్డు నియామకంలోనే అనేక రకాల అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఎంతోమంది సమర్థవంతమైన వ్యక్తులు ఉన్న బి.ఆర్ నాయుడుకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. గత ఐదేళ్లుగా టీవీ5 ముసుగులో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు బిఆర్ నాయుడు. అప్పటి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పై విషం చిమ్మడంలో టీవీ5 పాత్ర కూడా అధికం. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే టిటిడి చైర్మన్ పదవి భర్తీ చేయలేదు. చివరకు తన అస్మదీయుడు, తన సామాజిక వర్గానికి చెందినటువంటి బి.ఆర్ నాయుడుకు అవకాశం కల్పించారు చంద్రబాబు. బి ఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్నాక టీటీడీలో వరుసగా జరుగుతున్న పరిణామాలు కలచివేస్తున్నాయి. అయినా సరే ఎటువంటి దిద్దుబాటు చర్యలకు దిగడం లేదు. ఇప్పుడు ఏకంగా టీటీడీ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీసేలా సాక్షాత్ ట్రస్ట్ బోర్డు సభ్యుల వ్యవహరిస్తుండడం విశేషం. అయితే ఇది జరిగి 24 గంటలు గడుస్తున్న ఇంతవరకు చైర్మన్ బిఆర్ నాయుడు కానీ.. ఈవో కానీ స్పందించకపోవడం బాధ్యతరాహిత్యాన్ని తెలియజేస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!