Wednesday, March 19, 2025

కూటమికి కంటగింపుగా మారిన వాలంటీర్లు

- Advertisement -

ఏపీలో పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి సందడి ప్రారంభం అయింది. నామినేషన్ల పర్వం కూడా స్టార్ట్ చేశారు. ఉమ్మడి కృష్ణా- గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27న జరగనుంది. అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వ అప్రాజస్వామిక విధానాలను నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ నుంచి తప్పుకుంది. దీంతో కూటమి పార్టీల విజయం నల్లేరు మీద నడకేనని అంతా భావించారు. కానీ అందుకు వాలంటీర్లు జలక్ ఇచ్చారు. తమకు ఇచ్చిన మాటను తప్పినందుకు కూటమిపై పోటీ చేసేందుకు డిసైడ్ అయ్యారు. దీంతో ఏకగ్రీవం అవుతాయని భావించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు అనివార్యంగా మారాయి. విజయవాడలో జరిగిన వాలంటీర్ల సమావేశంలో గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాలంటీర్ వానపల్లి శివ గణేష్, కృష్ణా- గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాలంటీర్ లంక గోవిందరాజులు పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు.

గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరుపున పేరాబత్తుల రాజశేఖర్ పేరును మూడు నెలల కిందట ఖరారు చేశారు. ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. గోదావరి జిల్లాలోని పార్టీ సీనియర్లు, కూటమి ఎమ్మెల్యేలు, మంత్రుల సహకారంతో ఆయన దూసుకుపోతున్నారు. పెద్ద ఎత్తున పట్టభద్రుల ఓట్లను కూడా చేర్చుతున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు సైతం మరోసారి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు వలంటీర్ సైతం రంగంలోకి దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఆయనకు వైసిపి మద్దతు తెలిపే అవకాశం ఉంది.

ఇంకోవైపు గుంటూరు- కృష్ణ పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను టిడిపి ప్రకటించింది. మూడు నెలల కిందట ఈయన పేరు ఖరారు చేయడంతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే నామినేషన్ సైతం దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ అనూహ్యంగా వాలంటీరంగంలోకి దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఒక్కో ఎమ్మెల్సీ స్థానంలో మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అంగ బలం ఆర్థిక బలం కలిగిన నేతలను కూటమి రంగంలోకి దించింది. మరోవైపు వామపక్షాలతో పాటు ప్రజాసంఘాల అభ్యర్థుల సైతం రంగంలో ఉన్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఒలంటీర్లు సైతం పోటీకి దిగడం ఆసక్తి కలిగిస్తోంది. ఫలితాలు ఏమాత్రం తారుమారు అయినా ఇబ్బందికర పరిస్థితులు తప్పవని కూటమి భావిస్తోంది. అందుకే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది.

తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని కూటమి నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వారి గౌరవం పెంచుతామని కూడా చెప్పుకొచ్చారు. పదివేల రూపాయల గౌరవ వేతనాన్ని అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. నైపుణ్య శిక్షణ ఇచ్చి వారిలో నైపుణ్యాన్ని పెంచుతామని కూడా చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకుండా మానేశారు. అందుకే ఇప్పుడు వలంటీర్లు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లాలని నిర్ణయించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేయాలని తీర్మానించుకున్నారు. ఏకపక్షంగా విజయం సాధిస్తామని అంచనా వేసుకున్న కూటమి పార్టీల అభ్యర్థులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!