Wednesday, March 19, 2025

శభాష్ సతీష్ రెడ్డి.. జగన్మోహన్ రెడ్డి మనసు గెలుచుకున్న నేత!

- Advertisement -

ఆయన సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పని చేశారు. బలమైన నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలో దిగారు. బలమైన కుటుంబం పై పోటీ చేస్తూ వచ్చారు. వరుసగా ఓటములు ఎదురైన నమ్ముకున్న పార్టీని వీడలేదు. అటువంటి నేతను నిర్లక్ష్యం చేసింది ఆ పార్టీ. దీంతో ఆ నేత రూటు మార్చారు. ఈ కుటుంబాన్ని అయితే ఎదురెళ్ళారో.. అదే కుటుంబం నీడకు వెళ్లారు. ఆ కుటుంబం కోసం బలంగా నిలబడుతున్నారు. ఇంతకీ ఎవరా నేత? ఏంటా కథ? తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ.

ఎస్ వి సతీష్ రెడ్డి.. కడప జిల్లాలో దశాబ్దాలుగా వినిపిస్తున్న మాట ఇది. పులివెందులలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ప్రత్యర్థి. తెలుగుదేశం పార్టీ ఉనికి లేకపోయిన పరిస్థితుల్లో కూడా నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు సతీష్ రెడ్డి. విద్యాధికుడు కావడంతో ఓర్పు, నేర్పుతో ముందుకు సాగారు. తొలుత వైయస్ రాజశేఖర్ రెడ్డి పై, తరువాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పై పోటీ చేస్తూ వచ్చారు. చివరకు అనూహ్య పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చెంతకు చేరారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. విధానపరమైన అంశాలతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. సతీష్ రెడ్డి లాంటి నేతలు జిల్లాకు ఒకరు ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

1989లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఎస్ వి సతీష్ రెడ్డి. ఆ ఎన్నికల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి పై పోటీ చేశారు. అక్కడ నుంచి పోటీ చేస్తూనే ఉన్నారు. వరుస ఓటములు ఎదురవుతూనే ఉన్నాయి. 2014, 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పై పోటీ చేసిన సతీష్ రెడ్డి ఓడిపోయారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. స్థానిక సంస్థల కోటాలో సతీష్ రెడ్డిని ఎమ్మెల్సీగా నిలబెట్టింది. వివేకానంద రెడ్డి పై సతీష్ రెడ్డి గెలవగలిగారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత సతీష్ రెడ్డి పై టిడిపి నాయకత్వం నిర్లక్ష్యం చేసింది. దీంతో ఆయన జగన్మోహన్ రెడ్డి పిలుపుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిన బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదవులు అనుభవించిన వారు రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. కానీ సతీష్ రెడ్డి మాత్రం ఏమాత్రం బెదరకుండా తన వాయిస్ను వినిపిస్తూ వచ్చారు. జిల్లాకు ఒకరు సతీష్ రెడ్డి మాదిరిగా ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనతి కాలంలోనే పూర్వ వైభవం సాధించడం ఖాయం.

కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది. ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాలకు గాను ఏడింట కూటమి విజయం సాధించింది. ఇటువంటి తరుణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భయపడుతున్నారు. కానీ సతీష్ రెడ్డి మాత్రం చెడుగుడు ఆడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పై సోదరి షర్మిల నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆ సమయంలో సైతం స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తుంటారు సతీష్ రెడ్డి. మొత్తానికి ఒకప్పటి తమ కుటుంబ ప్రత్యర్థి.. ఇప్పుడు తనకు అండగా నిలవడంపై జగన్మోహన్ రెడ్డి సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సతీష్ రెడ్డి సేవలను తప్పకుండా వినియోగించుకుంటామని చెబుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!