Wednesday, March 19, 2025

గెలిచిన నేతనే తమ వాడిగా చూపించిన చంద్రబాబు.. చాణుక్య రాజకీయం అంటే అదే!

- Advertisement -

చంద్రబాబు మరోసారి తన చాణుక్య రాజకీయాన్ని ప్రదర్శించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. నేరుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ మీడియా ముందుకు వచ్చి ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు మద్దతు ప్రకటించారు. అయితే ఆ అభ్యర్థి ఓడిపోయారు. పి ఆర్ టి యు అభ్యర్థిగా పోటీ చేసిన గాదె శ్రీనివాసుల నాయుడు గెలిచారు. కానీ ఇక్కడే చంద్రబాబు సీన్ రివర్స్ చేశారు. గాదె శ్రీనివాసులు నాయుడు సైతం తమ అభ్యర్థి అన్నట్టు మంత్రి అచ్చం నాయుడుతో ప్రకటన ఇప్పించారు.

సాధారణంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు బరిలో దిగారు. ఉపాధ్యాయ సంఘాల నుంచి బరిలో దిగిన వారికి మద్దతు తెలుపుతారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత.. పోలింగ్ కు కొద్ది రోజుల ముందు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీ భరత్ మీడియా ముందుకు వచ్చారు. కూటమి ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు మద్దతు ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. ఉత్తరాంధ్రలోని మూడు పార్టీలు రఘువర్మకు సహకరించాలని కూడా కోరారు.

అయితే ఇప్పుడు కూటమి బలపరిచిన రఘువర్మ ఓడిపోయేసరికి కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. గాదె శ్రీనివాసుల నాయుడు సైతం తమ అభ్యర్థి అని చెప్పుకొస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యుటిఎఫ్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. దీంతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి రఘువర్మతో పాటు శ్రీనివాసులు నాయుడు ను సైతం గెలిపించాలని కోరినట్లు టిడిపి నేతలు తాజాగా చెబుతున్నారు. దీనిపై రకరకాల ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తోంది.

వాస్తవానికి గాదె శ్రీనివాసులు నాయుడుకు బిజెపి మద్దతు తెలిపింది. ఉత్తరాంధ్రకు చెందిన బిజెపి నేత పివిఎన్ మాధవ్ బాహటంగానే మద్దతు తెలిపారు. ఈ చిన్న పాయింట్ను లాజిక్కుగా చేసుకుని చంద్రబాబు మళ్ళీ పావులు కదపడం ప్రారంభించారు. అదే బిజెపి మాధవ్ ద్వారా శ్రీనివాసులు నాయుడును తన దగ్గరకు తెప్పించుకున్నారు. తనను గెలిపించినందుకు థాంక్స్ చెప్పుకునేందుకే సీఎం చంద్రబాబును కలిశానని అదే గాదె శ్రీనివాసులు నాయుడుతో చెప్పించారు. తద్వారా ఉత్తరాంధ్రలో కూటమి ప్రభుత్వానికి షాక్ అన్న ప్రచారానికి చెక్ చెప్పారు. శ్రీనివాసులు నాయుడు సైతం కూటమి అభ్యర్థి అని ఆయన నోటితోనే చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో కొంత సక్సెస్ అయ్యారు. అయితే మున్ముందు శ్రీనివాసులు నాయుడు వ్యవహార శైలి బట్టి ఆయన కూటమి మద్దతు దారుడా? కాదా అనేది తెలియనుంది.

అయితే అప్పటి వరకు గెలుపు బాటలో ఉన్నారు పాకలపాటి రఘువర్మ. కానీ కూటమి మద్దతు ప్రచారంతో వెనుకబడిపోయారు. చేజేతుల ఓటమిని సొంతం చేసుకున్నారు. ఒకవైపు కూటమి మద్దతు అంటూనే బిజెపి దెబ్బతీసింది. టిడిపి తో పాటు జనసేన నేతలు ఆశించిన స్థాయిలో సహకరించలేదు. ఇలా అన్ని విధాలుగా రఘువర్మ మోసానికి గురయ్యారు. శ్రీనివాసులు నాయుడు గెలవడంతో చంద్రబాబు ఆయనను అక్కున చేర్చుకున్నారు. తమ వాడి అని ఆయన నోటితోనే అనిపించే ప్రయత్నం చేశారు. మొత్తానికి అయితే తన చంద్ర రాజకీయం చూపించారు చంద్రబాబు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!