రాజకీయాల్లో విలువలు దిగజారిపోయాయి. అవసరాలు మాత్రమే పనిచేస్తున్నాయి. తమ ఉన్నతికి, తమ ప్రయోజనాలకు అవసరమైన మూలాలను మరిచిపోతున్నారు. ఇప్పటివరకు కలిగిన ప్రయోజనాలు కంటే.. ఇకముందు కలిగే లాభాలు గురించి ఆలోచన చేస్తున్నారు. అటువంటి నేతల్లో మాజీ మంత్రి జోగి రమేష్ ఒకరు. వెనుకబడిన తరగతుల నుంచి వచ్చిన జోగి రమేష్ ను గుర్తించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్ దృష్టిలో పడేందుకు ఏకంగా చంద్రబాబు పైనే దండయాత్ర చేశారు జోగి రమేష్. ఏకంగా చంద్రబాబు నివాసం పైనే దాడి చేశారు. అటువంటి నేతకు ప్రాధాన్యం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అలా ప్రాధాన్యం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేశారు జోగి రమేష్. రాజకీయ అవసరాల వరకే జగన్మోహన్ రెడ్డిని పరిగణలోకి తీసుకున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉంటే కనీసం మొఖం కూడా చూపడం లేదు. ఆపై ప్రత్యర్థులతో చేతులు కలిపి పార్టీని వీడేందుకు కూడా సిద్ధపడ్డారు జోగి రమేష్. రాజకీయాలు అంటేనే సిగ్గుపడేలా వ్యవహరించారు జోగి రమేష్.
జోగి రమేష్ కోసం చాలామంది నాయకులను వదులుకున్నారు జగన్మోహన్ రెడ్డి. వసంత కృష్ణ ప్రసాద్ లాంటి నమ్మకస్తుడైన నేతను జగన్మోహన్ రెడ్డి వదులుకునే విధంగా చేసిన వ్యక్తి వన్ అండ్ ఓన్లీ జోగి రమేష్. రాజకీయాలు అంటే అవసరాలు అన్నట్టు ఊసరవెల్లి రాజకీయాలు నడిపారు జోగి రమేష్. అటువంటి వ్యక్తి నైజం తెలియక రాజకీయంగా ప్రోత్సహించారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో ఎంతోమంది నమ్మకస్తులైన నేతలను సైతం వదులుకున్నారు. అందుకు 2024 ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారు.
రాజకీయాలు అంటే నమ్మకం. రాజకీయాలు అంటే ఒక భరోసా. రాజకీయాలు అంటే ఒక సిద్ధాంతం. ఇది మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆ కుటుంబానికి అలవాటు చేసిన విద్య. కానీ నాటు వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ బిక్ష పెట్టారు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి అంతకుమించి అవకాశాలు కల్పించారు. అయినా సరే ఆ కుటుంబానికి అన్యాయం చేశారు జోగి రమేష్. తిన్నింటి వాసాలనే లెక్కపెట్టిన ఘనుడు ఆయన. రాజకీయ అవసరాలు తీర్చిన కుటుంబాన్ని నట్టేట ముంచిన నేత ఆయన. నాడు తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పిలిచి మరీ ప్రోత్సాహం అందించారు. కొడుకు రాజశేఖర్ రెడ్డి తాహత్తుకు మించి అవకాశం ఇచ్చారు. అయినా సరే వారి ఔన్నత్యాన్ని గుర్తించలేకపోయారు జోగి రమేష్.
జోగి రమేష్ బలహీన వర్గాల కు చెందిన వ్యక్తి. యువజన కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనను గుర్తించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. 2009లో పెడన నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చారు మహానేత. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. ఒక ద్వితీయ శ్రేణి నాయకుడికి అందలం ఎక్కించారు. ఆ అభిమానంతోనే 2012లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు జోగి రమేష్. జగన్మోహన్ రెడ్డి సైతం 2014లో మైలవరం నియోజకవర్గం నుంచి అవకాశం ఇచ్చారు. అయినా సరే ఓడిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ ను మర్చిపోలేదు. ఏకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు చేశారు. 2019లో పెడన నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో గెలిచేసరికి మంత్రిగా అవకాశం ఇచ్చారు.
జోగి రమేష్ దూకుడుతో ప్రధమ నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు. తనను నమ్మిన నాయకుడని భావించి 2024 ఎన్నికల్లో పెనమలూరు నుంచి అవకాశం ఇచ్చారు. అప్పటికే అక్కడ కొలుసు పార్థసారథి బలమైన నేతగా ఉన్నారు. అయినా సరే తనను నమ్మిన నాయకుడిగా ఎనలేని అవకాశం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీ చేసిన జోగి రమేష్ ఓడిపోయారు. ఓడిపోయిన నాటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన నైజాన్ని తెలిసిన కూటమి నేతలు దరిచారనివ్వలేదు. అయినా సరే అదే ప్రయత్నంతో ఉన్నారు. కనీసం తనకు అవకాశం ఇచ్చిన కుటుంబమని మరిచి.. జగన్మోహన్ రెడ్డి విషయంలో తీవ్ర అన్యాయానికి పాల్పడుతున్నారు జోగి రమేష్. కృష్ణాజిల్లాలో మిగతా నాయకులంతా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధపడినా.. జోగి రమేష్ మాత్రం కృత్రిమ ఆలోచనలతో ఉన్నారు. అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సహించడం లేదు