Wednesday, March 19, 2025

ఇప్పటికీ గుణపాఠాలు నేర్వని జగన్మోహన్ రెడ్డి.. తలసీల రఘురాం లాంటి నేతలను నమ్మితే ఎలా?

- Advertisement -

రాజకీయం.. ఈ రంగంలో రాణించిన వారు విభిన్నంగా ఉంటారు. కొందరు రాత్రికి రాత్రే నాయకుడిగా ఎదిగిపోతారు. మరికొందరు జీవితాంతం నాయకుడిగా ఎదగాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. మరికొందరు ఈ ప్రయత్నంలో భాగంగా విఫలమవుతుంటారు. ఇంకొందరు ప్రయత్నం చేస్తూనే సఫలీకృతం అవుతారు. అయితే రాజకీయంగా రాణించడానికి అదృష్టం కూడా తోడు కావాలంటారు. అదృష్టం లేనిదే రాజకీయాల్లో రాణించలేమని ఎక్కువమంది నమ్ముతారు. అయితే ఈ నమ్మకాలను పక్కన పెడితే.. మరికొందరు నాయకులు తమకు తాము అవకాశాలు కల్పించుకొని.. నాయకులుగా ఎదుగుతుంటారు. ఇటువంటి కోణంలో చెందిన వారే తలశిల రఘురాం. సామాజిక వర్గం రీత్యా ఈయన కమ్మ. కానీ జగన్మోహన్ రెడ్డికి ‘కమ్మ’నైన నాయకుడిగా గుర్తింపు సాధించారు. కమ్మ సామాజిక వర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కమ్మనైన నాయకుడిగా నమ్మకం కుదుర్చుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు డెంట్, షామియానాలు బిగిస్తూనే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టుడైన నాయకుడిగా మారిపోయారు. అనతి కాలంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక నాయకుడిగా ఎదిగారు. జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాల నిర్వాహకుడిగా మారిపోయారు.

ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అంటే సామాజిక వర్గాల వారీగా విడిపోయిన రోజులు ఇవి. కమ్మ సామాజిక వర్గం అయితే తెలుగుదేశం పార్టీ… రెడ్డి సామాజిక వర్గం అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. కాపు సామాజిక వర్గం అయితే జనసేన.. ఇలా సీన్ మారిపోయింది. తొలినాళ్లలో రెడ్డి సామాజిక వర్గం అంటే యాంటీ తెలుగుదేశం. అదే కమ్మ సామాజిక వర్గం అయితే యాంటీ కాంగ్రెస్ భావజాలం. ఇలాంటి వాతావరణంలో కాపు సామాజిక వర్గం ప్రతి ఎన్నికలను డిసైడింగ్ ఫ్యాక్టర్ గా నిలిచింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఏపీలో భిన్న పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఈ పరిస్థితులు పతాక స్థాయికి చేరాయి.

అయితే సామాజిక వర్గం మాట అటు ఉంచితే.. సమయం సందర్భం.. పరిస్థితులకు తగ్గట్టు అడుగులు వేసే నాయకులు ప్రతి సామాజిక వర్గంలో ఉంటారు. అలానే కమ్మ సామాజిక వర్గంలో వన్ అండ్ ఓన్లీ నేత తలసిల రఘురాం. జగన్మోహన్ రెడ్డి బలహీనతను బలంగా మార్చుకున్న నాయకుడు ఇతను. ఎక్కడో టెంట్ హౌస్ లు అద్దెకు నడిపే ఈయన జగన్మోహన్ రెడ్డి అంతరంగాన్ని గ్రహించారు. ఆయనకు దగ్గరయ్యారు. కమ్మ సామాజిక వర్గంలో భిన్నమైన నేతగా గుర్తింపు పొందారు. ఎవరికీ లేని తెలివితేటలతో జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు టెంట్ హౌస్ లు అందించే ఈయన క్రమేపి ఎదిగారు. చివరకు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాల నిర్వాహకుడిగా మారిపోయారు.

కొందరు నేతలు చాలా ఒదిగి ఉంటారు. చాలా తగ్గి ఉంటారు. అటువంటి నాయకుడే తలశిల రఘురాం. కమ్మ సామాజిక వర్గం నేత అయినా జగన్మోహన్ రెడ్డి అభిమానాన్ని చూడగొన్నారు అంటే ఈయన ఎంతటి గానాపాటి అన్నది అర్థమవుతుంది. తొలుత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు టెంట్ హౌసులు నడిపే ఈయన.. క్రమేపి జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలకు రఘురాం లేనిదే కాదు అన్నట్టు పరిస్థితిని క్రియేట్ చేశారు. అలాగని వేరే పార్టీలో పక్క చూపులు చూసే వ్యక్తి కాదు. అలా జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. 2021లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయ్యారు. కానీ ఆయన ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత అని జగన్మోహన్ రెడ్డి మరిచిపోయాలా చేసిన నేర్పరి తలశిల రఘురాం.

కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు తలసిల రఘురాం. 1996 నుంచి 2002 వరకు కృష్ణాజిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణ అనంతరం జగన్మోహన్ రెడ్డి పంచన చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులు అయ్యారు. క్రమేపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల సమన్వయకర్తగా ఎదిగారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టుడిగా మారిపోయారు. 2019 నుంచి 2024 మధ్య ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయకర్తగా మారిపోయారు. 2021 లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో ఎటువంటి ముద్ర చూపలేకపోయారు తలసిల రఘురాం.

2024 ఎన్నికల్లో అతికొద్దిమంది కమ్మ సామాజిక వర్గం నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్, బ్రహ్మయ్య నాయుడు.. వంటి నేతలు కమ్మ సామాజిక వర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి మద్దతు దారులుగా నిలిచారు. కానీ తలసిల రఘురాం లాంటి నేతలు కేవలం పదవులుకే అన్నట్టు వ్యవహరించారు. తమ సామాజిక వర్గంలో కనీసం ప్రభావం కూడా చూపలేకపోయారు. ఇప్పుడు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వారి హవా నడుస్తోంది. తాము లేనిదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లేదు అన్నట్టు వారి వ్యవహార శైలి ఉంది. కనీసం తమ కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక్క ఓటు కూడా సంపాదించలేని రఘురాం లాంటి నేతలకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం.. వైసీపీ శ్రేణుల్లో కూడా మింగుడు పడని అంశం. ఇప్పటికీ వాటర్ నుంచి గుణపాఠాలు నార్వలేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ తలసీల రఘురాం లాంటి నేతలను నమ్ముతూనే ఉన్నారు. ఇక తేల్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!