Sunday, March 16, 2025

చంద్రబాబుపై రగిలిపోతున్న యనమల!

- Advertisement -

చంద్రబాబుపై సీనియర్ నేత యనమల రగిలిపోతున్నారా? ఆయన రాజకీయ ఉన్నతికి పాటుపడితే తనపై వేటు వేయడం తగునా అని బాధపడుతున్నారా? సరైన పదవీ విరమణ లేదని ఆందోళనతో ఉన్నారా? దీనంతటికీ లోకేష్ కారణమని ఆగ్రహంతో ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ యనమల రామకృష్ణుడు. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన రామకృష్ణుడును నందమూరి తారక రామారావు. 1983లో తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు యనమల రామకృష్ణుడు. ఎన్టీఆర్ సాదరంగా ఆహ్వానించి యనమల రామకృష్ణుడు కు ఎంతో ప్రాధాన్యమిస్తూ వచ్చారు. కానీ చంద్రబాబు పుణ్యమా అని అదే యనమల రామకృష్ణుడు నందమూరి తారక రామారావుకు ద్రోహం చేశారు అన్న అపవాదు ఎదుర్కొన్నారు.

వాస్తవానికి చంద్రబాబు కంటే యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత. అయితే 1983లో పార్టీలో జాయిన్ అయ్యారు యనమల రామకృష్ణుడు. కానీ చంద్రబాబు మాత్రం 1985లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983లో తెలుగుదేశం అభ్యర్థి చేతిలో ఓడిపోయిన తరువాత మాత్రమే.. ఆయన తన మామ ఎన్టీఆర్ గొడుగు కిందకు వచ్చారు. కానీ అప్పటికే యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఆపై మంత్రి.

1985లో తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు చంద్రబాబు. అనతి కాలంలోనే పార్టీ సాధించారు. ఈ క్రమంలో సీనియర్లుగా ఉన్న యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు లాంటి నేతలను తన చెప్పు చేతల్లోకి తీసుకున్నారు. వారితోనే 1995లో ఎన్టీఆర్కు వ్యతిరేకంగా పావులు కదపడంలో సక్సెస్ అయ్యారు.

వాస్తవానికి ఎక్కువ మంది నేతలు స్పీకర్ కంటే మంత్రి పదవి కోరుకుంటారు. క్యాబినెట్ హోదా తో సమానమైన స్పీకర్ పదవికి పాలనాపరమైన ప్రియారిటి ఉండదు. ఆపై ప్రత్యేక నిధులు అంటూ ఉండవు. అందుకే స్పీకర్ కంటే మంత్రి పదవిని ఎక్కువ మంది కోరుకుంటారు. అలానే కోరుకున్నారు యనమల రామకృష్ణుడు. కానీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఎన్టీఆర్ పై ఒక రకమైన అసంతృప్తితో గడిపారు యనమల. దానిని క్యాష్ చేసుకున్నారు చంద్రబాబు.

1995లో సీనియర్లు ఒకవైపు, నందమూరి కుటుంబం మరోవైపు చంద్రబాబు. వైస్రాయ్ హోటల్ వేదికగా సరికొత్త రాజకీయ గేమ్ ఆడారు చంద్రబాబు. దానికి రాజ గురువు రామోజీ హెల్ప్ చేశారు. అసలు బలమే లేని చంద్రబాబును బలవంతుడిగా చూపించారు. ఈ క్రమంలో నందమూరి కుటుంబంతో పాటు టిడిపి ఎమ్మెల్యేలు అంతా వైస్రాయ్ హోటల్ వేదికగా చంద్రబాబు శిబిరానికి చేరారు.

అయితే నాడు చంద్రబాబు కేవలం ఎన్టీఆర్ అల్లుడు మాత్రమే. కానీ నందమూరి తారకరామారావు ఒక వ్యవస్థ.. ఒక సమ్మోహన శక్తి. ఎన్టీఆర్కు ఎదురైన పరాభవాన్ని చూసి ప్రజలు కూడా తరుక్కుపోయారు.. అసెంబ్లీ వేదికగా ఆయన ప్రసంగాన్ని వినేందుకు ఆసక్తి చూపారు. కానీ ఆ సమయంలో యనమల రామకృష్ణుడి ద్వారా దానిని అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యారు చంద్రబాబు. నాడు కానీ యనమల రామకృష్ణుడు ఎన్టీఆర్కు ప్రసంగించే అవకాశం ఇచ్చి ఉంటే.. చంద్రబాబు శకం ముగిసినట్టే. కానీ యనమల అలా చేయలేదు. తనకు పొలిటికల్ లైఫ్ ఇచ్చిన ఎన్టీఆర్ కంటే.. తన రాజకీయ ఉన్నతికి సహకరిస్తానన్న చంద్రబాబు మాటకు కట్టుబడి ఉండిపోయారు.

అయితే తన ఉన్నతికి పాటుపడిన యనమలకు ఎనలేని ప్రాధాన్యమిచ్చారు చంద్రబాబు. పార్టీ అధికారంలో లేకున్నా ఏదో ఒక పదవిలో యనమల రామకృష్ణుడు కొనసాగిస్తూ వచ్చారు. 2004లో పార్టీ అధికారానికి దూరమైతే యనమలను మాత్రం ఈ రోజు నాటికి ఎమ్మెల్సీగా కొనసాగించారు. కానీ కాలం ఒకలా ఉండదు. రాజకీయాల్లో ప్రయోజనాలే తప్ప.. ఇతర అంశాలకు తావు ఉండదు. అందుకే యనమల రామకృష్ణుడును సైడ్ చేశారు చంద్రబాబు. దానిని జీర్ణించుకోలేకపోతున్నారు ఆ సీనియర్ నేత.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!