కర్ణుడు పెళ్లికి సవాలక్ష కారణాలు అన్నట్టు.. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని ఏకాకి చేసి ఈ ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టారు చంద్రబాబు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు బిజెపి అగ్రనాయకత్వం చేతులు కలిపింది. ఒక పద్ధతి ప్రకారం ప్రజల్లోకి వెళ్లి అభూత కల్పనలు, అసత్య ప్రచారాలు చేయడంలో సక్సెస్ అయింది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని.. లేకుంటే మాత్రం ఆ పార్టీ ఓడిపోయే పరిస్థితి లేదని ఇప్పటికీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు పవన్ కళ్యాణ్ ఎంతకైనా దిగజారే ఎందుకు సిద్ధపడ్డారు. అది ఎలా అంటే టిడిపి ఎన్ని సీట్లు ఇచ్చిన తీసుకునేదాకా. ఏ నియోజకవర్గంలో నుంచి పోటీ చేయాలన్న చేసేదాకా. ఆయన ఏకైక లక్ష్యం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం. ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు.
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 40 శాతం ఓటు బ్యాంకు ఉంది. 2019 నుంచి 2024 మధ్య సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అమలు చేశారన్న గొప్ప పేరు ఉంది. కానీ 2024 ఎన్నికల్లో రెట్టింపు సంక్షేమం అనే మాట అనకపోవడం జగన్మోహన్ రెడ్డి లోపం. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి మించి సంక్షేమం అమలు చేస్తామని చెప్పడం చంద్రబాబుకు ప్లస్ గా మారింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో బలంగా కనిపించింది. కానీ అదే సమయంలో ఆ బలం పై విషప్రచారం జరిగింది. ప్రజలను కుల మతాలుగా విభజించింది. అభివృద్ధి జరగలేదన్న విమర్శను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. దానిని గుర్తించడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది.
ఎన్నికల సర్వే ఫలితాల్లో వాస్తవాలకు దగ్గరగా ఉండేవారు ఆరా మస్తాన్. ప్రజల్లోకి తన బృందాన్ని
పంపించి ప్రజల మూడ్ ను తెలుసుకున్నారు. అయితే ప్రజల్లో ఎక్కడ వ్యతిరేక భావన కనిపించలేదు. ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూలత వ్యక్తం అయ్యింది. అందుకే నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పానని ఆరా మస్తాన్ తాజాగా తెలిపారు. అయితే నాడు తన అభిప్రాయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నచ్చిందని.. సహజంగానే ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటారని.. అనుకూలంగా ఇస్తే ఒకలా.. వ్యతిరేక ఫలితాలు ఇస్తే మరోలా చూస్తారని కూడా ఆరా మస్తాన్ స్పష్టం చేశారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలు మాత్రం విచిత్రంగా ఉన్నాయని చెబుతున్నారు ఆరా మస్తాన్. తనతో పాటు చాలామందికి అనుమానాలు ఉన్నాయని కూడా సంకేతాలు ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఇంతలా ఉంటుందని ఎవరూ ఊహించలేదని.. ప్రజల నుంచి ఇంతలా వ్యతిరేకత రాలేదని.. ఎక్కడో ఒక తేడా కొడుతోందని మాత్రం అనుమానం వ్యక్తం చేశారు. 2029 ఎన్నికల్లో మాత్రం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి వైపు గాలివీచే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.