Tuesday, September 10, 2024

పోలవరంపై షాకింగ్ కామెంట్స్ చేసిన హరీష్‌రావు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

- Advertisement -

కాళేశ్వరంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హరీష్‌రావు.. మైండ్ ఉందా మిత్రమా అంటూ కౌంటర్

అదేంటో తెలియదు కాని… జగన్ ప్రభుత్వం మీద కామెంట్ చేయలంటే.. ప్రతి ఒక్కరికి తారజువ్వ వదిలిన మాదిరిగా వచ్చేస్తోంది వెటకారం. జగన్ మీదనో లేక… లేదా వైసీపీ సర్కార్ మీదనో కామెంట్స్ చేస్తే రాజకీయంగా ఎదుగుతామని చాలామంది రాజకీయ నాయకులు భావిస్తున్నారు. జగన్ మీద కామెంట్స్ చేస్తే ఫ్రీ పబ్లిసిటీ వస్తుందనే ఉద్దేశంతో చాలామంది నాయకులు ఉన్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ నాయకులు కూడా జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఏపీలో పరిపాలన బాగుందనే ఏడుపో లేక తమ రాష్ట్రంలో ఏపీలో మాదిరిగా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదనే అసహనమో తెలియదు కాని.. తెలంగాణ నాయకులు కూడా ఈ మధ్య జగన్ సర్కార్ మీద విమర్శలు చేస్తున్నారు.

తాజాగా తెలంగాణ మంత్రి హరీష్ రావు.. పోలవరం ప్రాజెక్ట్‌ను కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో పోలుస్తూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. . పోలవరం ప్రాజెక్టు ఇంకో ఐదేళ్లలో కూడా పూర్తి కాదంటూ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాక రేపుతున్నాయి. పోలవరం కాళేశ్వరం కంటే ముందే స్టార్ట్ అయినప్పటికీ పూర్తి కాలేదని గుర్తు చేసిన ఆయన, మనం కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత వేగంగా పూర్తి చేసుకున్నామో అందరూ చూశారు అని వ్యాఖ్యలు చేశారు. పోలవరం పనులు పురోగతిపై అక్కడ ఇంజనీర్లతో మాట్లాడానని పేర్కొన్న మంత్రి, మరో ఐదు సంవత్సరాలలో పూర్తి చేస్తే గొప్పే అంటూ వ్యాఖ్యలు చేశారు. మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తప్పుపడుతున్నారు.

మంత్రి హరీష్ రావు అవగాహనతో ఉండి మాట్లాడారో లేదో అని అర్థం కావడం లేదని వారు కామెంట్స్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టులకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని… కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం రెండు టీఎంసీల సామర్థ్యం ఉన్న బ్యారేజ్ అని.. పోలవరం ప్రాజెక్టులో 196 టీఎంసీల నీటిని స్టోర్ చేసుకొవచ్చని.. ఇది కూడా తెలియని.. హరీష్ రావు ఎలా ఇరిగేషన్‌ మంత్రిగా ఎలా ఉన్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ముందు మీరు మీ రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని..తరువాత పక్క రాష్ట్రం గురించి ఆలోచించవచ్చని హరీష్ రావుకు హితవు పలుకుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!