దేశ ప్రధాని మోదీ ఏపీ పర్యటనను అన్ని రాజకీయ పక్షాలు కూడా నిశితంగా గమనించాయి. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న అధికార పార్టీ బీజేపీ రాష్ట్రంలో ఏపార్టీకి మద్దతిస్తుందో అని అందరు కూడా అతృతగా ఎదురు చూశారు. బీజేపీ మద్దతు తమకు అంటే తమకు అని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రకటించుకోవడానికి తెగా ఆరాట పడుతున్నాయి. ఇదే సమయంలో ప్రధాని మోదీ ఎదుటే… తమ రాజకీయ వైఖరి ఏంటో తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో .. మీకు ఉన్న అనుబంధం రాజకీయాలకు అతీతం అని…అంతే తప్ప తమకు ఎటువంటి రాజకీయాలకు తమ మధ్య తావు లేదని చెప్పకనే చెప్పడంతో… రాష్ట్రంలోని మిగిలిన నాయకులు షాక్ అయ్యారు.7
అయితే ప్రధాని మోదీ కూడా ఏపీలో ఉన్న జగన్ సర్కార్‌తో తమ అనుబంధం ఉందని తెలపడం జరిగింది. దీనికి ముందు జరిగిన రాజకీయ పరిణామాలను కూడా ఓసారి పరిశీలిస్తే.. ప్రధాని మోదీ విశాఖకు చేరుకోగానే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యంగా జగన్ మీదనే ఆయన ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం అందుతుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చింతంగా జగన్‌ను ఓడించాలని.. ఎట్టి పరిస్థుతుల్లో ఆయన్ను అధికారంలోకి రాకుండా చూడాలని .. మోదీని కోరారట పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు విన్న మోదీ… దీనిపై మీరు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారని ప్రశ్నించగా…ఆయన దగ్గర నుంచి సమాధానం లేదట.
సరే జగన్‌ను ఓడించడానికి మీకు సహకారం అందిస్తాం… మీరు సీఎం అవుతారా అంటే… లేదు చంద్రబాబు సీఎం అవుతారని.. పవన్ మోదీకి చెప్పినట్లుగా తెలుస్తోంది. 2014 మాదిరిగానే మన మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే…మళ్లీ జగన్‌ను ఓడించవచ్చని మోదీకి వివరించారట పవన్. అప్పుడు కూడా చంద్రబాబే సీఎం అవుతారు కదా అని పవన్‌కు కౌంటర్ వేశారట పవన్. మిమ్మల్ని సీఎం అభ్యర్థిగా టీడీపీ ఒప్పుకుంటుందా అని పవన్‌ను ప్రశ్నించరట మోదీ. దీనికి పవన్ మౌనంగా ఉండిపోయినట్లుగా తెలుస్తోంది.
మీరు సీఎం అవుతానంటే చెప్పండి. ఏదైనా చేద్దాం అని..అంతే కాని.. చంద్రబాబును నమ్ముకుని మీరు ముందుకు వెళ్లకండి..ఆయన స్వార్థపరుడు. ఇప్పటికే ఆయన పలుమార్లు మనల్ని మోసం చేశారని పవన్‌కు హితబోధ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రజల్లోకి బలంగా వెళ్లండి. మొదట మిమ్మల్ని మీరు నిరుపించుకోండి. పొత్తులు గురించి తరువాత ఆలోచిద్దాం అని చెప్పి..పవన్‌తో భేటీని ముగించారట మోదీ. బీజేపీ రాజకీయాలు ఎప్పుడు కూడా ముక్కుసూటిగా ఉండవనే విషయం తెలిసిందే. వారి రాజకీయ అవసరాలను బట్టి వారు ప్రవర్తిస్తుంటారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ రాష్ట్రల్లో బీజేపీకి వ్యతిరేకపవనాలు వీస్తున్నాయని తెలుస్తోంది. ఇటువంటి సమయంలో ఏపీలో జగన్ దోస్తీని వదులుకోవడానికి వారు సిద్దంగా లేరని తెలుస్తోంది. పవర్ లేని పవన్, ప్రజ బలం లేని చంద్రబాబులు కంటే.. మాస్ ఇమేజ్ ఉన్న జగన్‌తో ఉంటే బెటర్ అని బీజేపీ నాయకుల ఆలోచనగా కనబడుతుంది. ఇదే సమయంలో జగన్ కూడా ఎటు ఎవరు కేంద్రంలో ఉంటే వారికే మద్దతిస్తారు. కాబట్టి జగన్‌తో వచ్చిన సమస్య ఏమి లేకపోవడం కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. ఈ రాజకీయ సమీకరణాలన్ని కూడా చూసిన తరువాత జగన్‌తో ఉంటేనే బీజేపీకి మంచిదని తెలుస్తోంది.