Friday, March 29, 2024

చంద్రబాబుతో పవన్ భేటీపై బీజేపీ గుర్రు..ఇక దబిడి దిబిడేనా..?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కల్యాణ్ తాజా భేటీపై ఏపీ రాజకీయాల్లో సంచలనానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఆదివారం వీరిద్దరు హైదరాబాద్‌లో కలుసుకున్నారు. దాదాపు గంటకు పైగానే వీరి భేటీ సాగింది. ఈ సమావేశంలో కొత్తగా తీసుకువచ్చిన జీవోలతో పాటు, భవిష్యత్తు రాజకీయ పొత్తుల గురించి చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం దాదాపు ఖారారు అయినట్లే అని మాటలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుతో పవన్ భేటీపై అధికార వైసీపీ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. చంద్రబాబు పవన్ ముసుగు తీశారని పవన్ ప్యాకేజీ స్టార్ అని నిప్పులు చెరుగుతున్నారు. ఇదిలా ఉంటే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ టీడీపీ నాయకుడును ఎలా కలుస్తారని కొందరు బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

తాజాగా దీనిపై బీజేపీ ప్రధాన కార్యదర్శి అయిన విష్ణువర్థన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు , పవన్ కల్యాణ్ భేటీలో పెద్దగా ప్రాముఖ్యత లేదని విష్ణువర్థన్ రెడ్డి చెప్పుకొచ్చారు. గ‌తంలో విశాఖ‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్న‌ప్పుడు చంద్ర‌బాబు వెళ్లి సంఘీభావం తెలిపార‌ని.. ఇటీవ‌ల కుప్పంలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబును పోలీసులు అడ్డ‌గించ‌డంతో కృత‌జ్ఞ‌త‌గా ప‌వ‌న్ వెళ్లి క‌లిసి ఉంటార‌ని విష్ణు అన్నారు. అంతే త‌ప్ప వీళ్ల భేటీకి పెద్ద‌గా ప్రాధాన్యం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కాని చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ కావడం మాత్రం ఖచ్చితంగా పవన్‌కు సంకంటంగా మారుతుందని ఆయన తన అభిప్రాయంగా వెల్లడించారు.

ఇప్పటికే పవన్ కల్యాణ్‌ను ప్యాకేజీ స్టార్ అని అంటున్నారని.. ప్ర‌త్య‌ర్థులు సోష‌ల్ మీడియా, ప్ర‌ధాన మీడియాలో సాగిస్తున్న ప్ర‌చారంలో కూడా ఇదే వాదన తెర మీదకు వస్తుందని.. ఇప్పుడు పవన్ చంద్రబాబుతో భేటీ కావడంతో త‌ప్ప‌కుండా జ‌న‌సేనానికి న‌ష్టం క‌లుగుతుంద‌న్నారు. బీజేపీతో జ‌న‌సేన పొత్తులో ఉంటే ప‌వ‌న్‌కు ముఖ్య‌మంత్రి అవకాశం వ‌స్తుంద‌న్నారు. టీడీపీతో వెళితే పవన్ సీఎం అయ్యే అవకాశం ఉండ‌ద‌ని విష్ణువర్థన్ రెడ్డి తేల్చి చెప్పారు. త‌మ‌లో ఒక‌ర్ని సీఎంగా చూడాల‌ని కాపులు కోరుకుంటున్నార‌ని .. అది పవన్ అయితేనే అందరికి మంచి జరుగుతుందని చెప్పారు.ప‌వ‌న్‌క‌ల్యాణ్ లాంటి బ‌ల‌మైన నాయ‌కులు..చంద్రబాబుతో భేటీ అయితే అది ఆయన్ను బ‌ల‌హీన‌ప‌రుస్తుంద‌ని షాకింగ్ కామెంట్స్ చేశారాయన. జ‌న‌సేన‌తోనే తాము క‌లిసి వెళుతున్న‌ట్టు మ‌రోసారి ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మరి పవన్ కల్యాణ్ బీజేపీతో ఉంటారో లేదా.. టీడీపీతో అడుగులు వేస్తారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!