Thursday, April 25, 2024

జగన్‌కు అత్యంత సన్నిహితుడు మనస్థాపం..? వచ్చే ఎన్నికల్లో పోటీ దూరం

- Advertisement -

వైసీపీ కీలక నేత , జగన్‌కు అత్యంత సన్నిహితుడు గుంటూరు ఎమ్మెల్యే ముస్తాఫా మనస్థాపం చెందారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని చెప్పి అందరికి షాక్ ఇచ్చారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే… వైసీపీ స్థాపించిన నాటి నుంచి కూడా జగన్ వెంట నడిచిన వారిలో ముస్తాఫా కూడా ఒకరు. 2014,2019 ఎన్నికలలో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ముస్తాఫా విజయం సాధించారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ..ముస్తాఫాను కొనుగొలు చేయాలని అప్పటి సీఎం చంద్రబాబు చాలానే ప్రయత్నాలు చేశారు. కాని ముస్తాఫా మాత్రం తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

ఇక 2019లో కూడా ముస్తాఫా విజయం సాధించడంతో ..ఆయనకు ముస్లీం కోటాలో మంత్రి పదవి వస్తుందని అందరు భావించారు. కాని కడప జిల్లాకు చెందిన అజాం భాషాకు మంత్రి ఇవ్వడంతో..ముస్తాఫాకు పదవి లేకుండాపోయింది. అయినప్పటికి కూడా ముస్తాఫా ఎక్కడ కూడా తన అసంతృప్తిని బయటపెట్టలేదు. అలాంటి ముస్తాఫా ఒక్కసారిగా తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించి సంచలనం సృష్టించారు. రాజకీయ సన్యాసం ప్రకటించడం వెనుక కారణాలేంటన్న చర్చ వైసీపీలోనే జరుగుతుంది.అయితే కొంత కాలం నుంచి ముస్తాఫా కొంత అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. జిల్లా నేతలు ఎవరు కూడా లెక్క చేయని పరిస్థితి నెలకొందట. కార్పొరేషన్ లోనూ ఆయన మాట చెల్లుబాటు కావడం లేదంటున్నారు. ఆ మనస్థాపంతోనే ముస్తాఫా వచ్చే ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట.

అయితే ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ముస్తాఫా కూతురు ఆయన స్థానంలో పోటీకి దిగుతున్నారనే చర్చ కూడా సాగుతుంది. దీని కారణంగానే ముస్తాఫా వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా వైసీపీలో యాక్టివ్‌గా ఉన్నారు. తండ్రితో పాటుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు అవుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు వచ్చిన సమయంలోనూ ముస్తఫా తన కుమార్తెను పరిచయం చేశారు. 2024లో జరిగే ఎన్నికల్లో ముస్తాఫా స్థానంలో కుమార్తె నూరి ఫాతిమా పోటీ చేసే అవకాశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి. నూరి ఫాతిమా అభ్యర్థిత్వనికి జగన్ కూడా గ్రీన్ సీగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. అందుకే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ముస్తాఫా ప్రకటించారని వైసీపీ వర్గాలు తెలిపాయి. దీనిపై అతి కొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!