Friday, March 29, 2024

మేకతోటి సుచరిత సంచలన ట్విట్..డిసైడ్ అయ్యారా..?

- Advertisement -

మేకతోటి సుచరిత.. ఈ పేరు చెప్పగానే.. ఆమె జగన్ వెంట నడిచిన రోజులు గుర్తుకు వస్తాయి. మేకతోటి సుచరిత రాజకీయాల్లోకి వచ్చిందే వైఎస్ఆర్ కుటుంబ అండతో. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో మేకతోటి సుచరిత అప్పుడే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ఆర్ మరణం తరువాత ఆయన తనయుడు జగన్ వెంట మేకతోటి సుచరిత నడిచారు. 2012లో జరిగిన బై ఎలెక్షన్స్‌లో మేకతోటి సుచరిత సుచరిత వైసీపీ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి కూడా ఆమె జగన్ వెంటే ఉన్నారు. జగన్ జైలుకు వెళ్లినప్పుడు కూడా.. ఆమె వైసీపీలోనే కొనసాగారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే మేకతోటి సుచరితకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ.. ఆమెకు హోంమంత్రి పదవిని కూడా అప్పగించారు.

కాని మంత్రివర్గ పున:వ్యవస్థీకరణలో భాగంగానే మేకతోటి సుచరితను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మేకతోటి సుచరిత వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. మేకతోటి సుచరిత ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. కాని తరువాత జగన్‌తో భేటీ తరువాత ఆమె కాస్తా మెత్తపడినట్లుగా కనిపించినప్పటికి కూడా.. తరువాత కొద్ది రోజులకు జిల్లా బాధ్యతల నుంచి తప్పుకోవడం.. మేకతోటి సుచరిత భర్త.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారనే వార్త తెర మీదకు రావడంతో.. ఆమె వైసీపీని వీడటం ఖాయం అని అందరు అనుకున్నారు. కాని అందరికి షాకిస్తూ.. మేకతోటి సుచరిత చేసిన ట్విట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని మేకతోటి సుచరిత చేసిన ట్విట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

జగన్‌ను నవతరం ఫులేగా అభివర్ణిస్తూ బర్త్‌డే విషెష్ తెలియజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనతో జగన్ పాలనను పోల్చారామె. 16 మెడికల్ కాలేజీలను నిర్మిస్తూ విద్యారంగంలోనే చరిత్ర సృష్టిస్తున్నారంటూ జగన్‌ను ప్రశంసించారు. ఈ క్రమంలోనే మేకతోటి సుచరిత ప్రత్యర్థులపై కూడా సెటైర్లు వేశారు. ప్రజలు ఏ మాత్రం విశ్వసించని నాయకుడంటే చంద్రబాబేనని, ప్రజలు స్వాగతించని నాయకుడంటే అది పవన్ కళ్యాణే అనే విమర్శించారు. ప్రజలు అస్యహించుకనే రాజకీయ నాయకుడంటే అది రఘరామరాజు అంటూ ట్వీట్ చేశారు. ఈ కామెంట్స్ చేయడం ద్వారా తాను పార్టీలోనే కొనసాగుతున్నాననే సంకేతాన్ని ఇచ్చినట్టు అయింది. ప్రత్తిపాడులో కొత్త అభ్యర్థిని రంగంలోకి దించుతున్నారనే మేకతోటి సుచరిత మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి కూడా మేకతోటి సుచరిత పార్టీ మళ్లీ క్రియశీలకంగా పని చేయాలని వైసీపీ అభిమానులు కోరుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!