Tuesday, March 19, 2024

జగన్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..మరోసారి మంచి మనస్సు చాటుకున్న సీఎం

- Advertisement -

జగన్ చేసిన పనికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

ఏపీ సీఎం జగన్ తాజాగా మరోమారు తన ఉదారతను చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న వారిని అదుకోవడంలో వైఎస్ ఫ్యామిలీ తరువాతే అని మరోసారి నిరుపించారు. అధికారంలో ఉన్న లేకపోయిన సాయం కోరి తన వద్దకు వచ్చిన వారిని జగన్ ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేసింది లేదు. కాకపోతే అధికారంలో ఉంటే సాయం చేయడానికి మరింత వీలు అవుతుంది అంతే తప్ప.. తన సాయం చేయడంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదని జగన్ మరోసారి నిరుపించారు. బుధవారం మదనపల్లె టిప్పు సుల్తాన్ గ్రౌండ్స్ నుంచి 4వ దశ జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు జగన్. ఈ సందర్భంగా వేదిక వద్ద హమీద అనే ఆమె తన కుమారుడు మొహమ్మద్ అలీకి దీర్ఘకాలిక వ్యాధి ఉన్న విషయం దృష్టికి తీసుకువెళ్లారు.

చికిత్స చేయించడానికి ఆర్ధిక స్థోమత సరిపోక ఇబ్బందులు పడుతున్నామని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. దీనిపై చలించిపోయిన జగన్.. తన దయార్ద హృదయాన్ని చూపారు. దీంతో ఆమె బాధితురాల వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం జగన్.. వెంటనే ఆమెకు ఆర్ధిక పరంగా సహాయం అందజేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. జగన్ ఆదేశాల మేరకు కలెక్టర్ గిరీష వెంటనే స్పందించారు. హమీదతో పాటు ఆమె కుమారుడు మొహమ్మద్ అలీని మదనపల్లె కలెక్టర్ కార్యాలయంకు పిలిపించి మరి . లక్ష చెక్కును ఆమెకు అందించారు. అలాగే నెలవారీగా 3000 రూపాయల పింఛను అందజేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

అలాగే స్విమ్స్‌లో మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్‌ సూచించారు. ఆరోగ్య ఖర్చులు మొత్తం కూడా ప్రభుత్వమే భరిస్తోందని .. సీఎం జగన్ గారు చెప్పామన్నారని కలెక్టర్ గిరీష హమీదకు తెలిపారు. దీంతో సీఎం జగన్, జిల్లా కలెక్టర్‌కు హమీద ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సీఎం జగన్ ఇలా చేయడం మొదటిసారి ఏం కాదు. గతంలో చాలామందికి ఇలానే సాయపడ్డారాయన. తాజాగా జగన్ మరోసారి తన ఉదారతను చాటడంతో..ఆయన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు అభిమానులు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!