Thursday, April 25, 2024

టీడీపీ నుంచి భారీగా జంప్ జిలానీలు..నేతల లిస్ట్ ఇదేనట..?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇద్దరు కూడా ఏపీలో సరికొత్త రాజకీయాలకు తెర లేపడం జరిగింది. మొన్నటి వరకు పవన్ కల్యాణ్ బీజేపీతో నడుస్తారని చాలామంది భావించారు. కాని ఆయన అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ… వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నట్లుగానే టీడీపీతో దోస్తీ కట్టడానికి రెడీ అయినట్లుగా కనిపిస్తుంది. కనిపించడం ఏంటీ రాబోవు ఎన్నికల్లో టీడీపీ , జనసేన పార్టీలు కలిసి బరిలోకి దిగడం ఖాయం అయిపోయినట్లే. దీనిపై ఇప్పటికే నాయకులందరికి కూడా క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ రెండు పార్టీలను అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఎలా నిలువరిస్తుందా అనేది ఇక్కడ అసలు ప్రశ్న. క్షేత్రస్థాయిలో వైసీపీ చాలాబలంగా ఉంది. దీనికి తోడు జగన్ సంక్షేమ పథకాలు వల్ల లబ్ధిపొందని కుటుంబం లేదు కాబట్టి.. ప్రజలు ఆయన పాలనపై సానుకులంగానే ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే టీడీపీ , జనసేన పార్టీలు కలిసి జగన్‌ను ఎలా ఓడిస్తాయో అనేది చూడాల్సి ఉంది. జనసేనతో పొత్తు టీడీపీకి ఓవైపు అదృష్టంగా మారితే.. మరో వైపు సంకటంగా మారిందనే చెప్పాలి. ఒకవేళ టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటే..ఆ పార్టీని వీడటానికి చాలామంది రెడీగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2024 ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే.. జగన్‌ను ఓడించలేమని ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలుసు. వైసీపీని ఓడించడానికి వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి టీడీపీ, జనసేన పార్టీలు సన్నద్దం అవుతున్నాయి. దీనిపై ఇప్పటికే లోబాయికర ఒప్పందం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనిలో భాగంగానే రాబోవు ఎన్నికల్లో 40 నుంచి 50 సీట్ల వరకు జనసేనకు కేటాయించాలని చూస్తున్నారట. కృష్ణా, గుంటూరు జిల్లా, ప్రకాశం. విశాఖ జిల్లాలలో కాపులు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో పవన్ జనసేన పార్టీ అభ్యర్థులకు కేటాయించాలని చూస్తున్నారట టీడీపీ అధినేత. ఇక కాపులు ఎక్కువుగా ఉండే పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాలు జనసేనకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఇక్కడే వచ్చింది అసలు సమస్య.

ప్రస్తుతం అక్కడ పని చేస్తున్న నాయకులు తమకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ వస్తోందో లేదో తెలియని అయోమయస్థితిలో టీడీపీ నాయకులు నిలిచిపోయారట. దీంతో ఆ నేతలందరు కూడా టీడీపీ నుంచి జంప్ .అవడానికి రెడీ అవుతున్నారట. పార్టీలో టిక్కెట్ రానప్పుడు ఎందుకు కష్టపడాలని మరికొందరు ప్రశ్నిస్తున్నారట. ఇన్నాళ్లు కష్టపడి పార్టీని నడిపిస్తే.. ఇప్పుడు పొత్తులో భాగంగా సీటు వేరే వారికి ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారట. ప్రధానంగా పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఈ జంప్ లు ఎక్కువగా ఉంటాయని తెలిసింది. నేతలు మరో ఆలోచన కూడా చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు… వైసీపీ నాయకులతో టచ్‌లో ఉన్నారని సమాచారం అందుతుంది. ఎన్నికల నాటికి టీడీపీ నుంచి చాలామంది బయటకు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరి టీడీపీ నుంచి వలసలను ఆ పార్టీ అధినేత ఎలా నిలువరిస్తారో చూడాల్సి ఉంది

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!