Friday, October 4, 2024

Lokesh: ప్రకాశం బ్యారేజ్‌ని ఢీకొట్టిన బోట్లు లోకేష్ సన్నిహితుడివే..బయటపడ్డ అసలు నిజాలు

- Advertisement -

Lokesh: ఇటీవల విజయవాడలోని కృష్ణ నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వచ్చింది. దీంతో పూర్తి స్థాయిలో గేట్లను ఎత్తిన అధికారులు ప్రవాహాన్ని సముద్రంలోకి వదిలారు. ఈ సమయంలో వరదలో కొట్టుకొచ్చిన భారీ బోట్లు ప్రకాశం బ్యారేజీ లోని 67, 68, 69 వ గేట్లకు బలంగా ఢీ కొట్టాయి. దీంతో గేట్ల కౌంటర్ వేయిట్ పిల్లర్లు డ్యామేజ్ అయ్యాయి. AP-IV-M-SB-0017, AP-IV-M-SB-0022, AP-IV-M-SB-0023 నెంబర్లు గల బోట్లు.. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. ఈ ఘటనలో బ్యారేజీలోని 67, 69, 70 గేట్లు దెబ్బతిన్నాయి.

దీంతో ఆ గేట్లకు కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ బోట్లకు వైసీపీ రంగులు వేసి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రకాశం బ్యారేజీని కావాలనే దెబ్బతీయాలని వైసీపీ కుట్రలు చేసిందని కూటమి ప్రభుత్వ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే పక్కాగా ప్లాన్‌ను అమలు చేశారని ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు. ఢీకొట్టిన 3 బోట్ల యజమాని వైసీపీ నేతవే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ తలశిల రఘురాంలకు బోట్ల యజమాని ఉషాద్రి రామ్మోహన్ సన్నిహితుడని ఆరోపించారు. బోట్లకు వైసీపీ రంగులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. టీడీపీ నేతలు చేస్తోన్న ఆరోపణలపై తాజాగా వైసీపీ కౌంటరిచ్చింది.ఆ బోట్ల యజమాని…మంత్రి నారా లోకేష్ సన్నిహితుడని వైసీపీ నాయకులు చెబుతున్నారు.

ఈ కేసులో నిందితుడు కోమటి రామ్మోహన్, ఉషాద్రిలను పోలీసులు అరెస్ట్ చేశారని, అందులో రామ్మోహన్…టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం బంధువు అని ఆరోపిస్తోంది. గతంలో లోకేష్‌తో కలిసి ఉషాద్రి దిగిన ఫొటోలను వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిందితులకు లోకేష్ తో సంబంధాలున్నాయనడానికి ఈ ఫొటోలే సాక్ష్యమని చెబుతోంది. వరద బాధితులంతా టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, దానిని తప్పుదోవ పట్టించేందుకే టీడీపీ ప్రయత్నిస్తోందని, అందుకే వైసీపీపై నిందలు వేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!