దేవినేని ఉమకు దిమ్మ తిరిగే వార్త..మైలవరంలో చంద్రబాబు సపోర్టు ఆయనకే ..?
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం నిత్యం వార్తల్లో నిలుస్తునే ఉంది. మొన్నటి వరకు కూడా అక్కడ అధికార , ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు గొడవలకు దిగేవారు. గతంలో మైలవరం నుంచి టీడీపీ తరుఫున దేవినేని ఉమ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. దేవినేని ఉమను ఓడించడానికి వసంత కృష్ణ ప్రసాద్ పని కట్టుకుని మరి.. వైసీపీలో చేరి మైలవరం నుంచి పోటీ చేసి ఆయన్ను ఓడించారు. ఎన్నికల తరువాత కూడా దేవినేని ఉమ, వసంత కృష్ణ ప్రసాద్ ఇరు వర్గాలు కూడా కత్తులు దూసుకున్న సందర్బాలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా నేతలు రూటు మార్చినట్లుగా స్పష్టంగా అవుతుంది.
వీరి ఇరువురుకు కూడా సొంత పార్టీ నేతల నుంచి తలనొప్పిలు ఎక్కువైయ్యాయి. అధికార విషయానికి వస్తే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్‌లకు మధ్య విభేదాలు వచ్చినట్లు నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతుంది. దీనిపై వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతుంది. ఇక టీడీపీ పరిస్థితి కూడా ఇలాగే కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుఫున మైలవరం నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. మొన్నటి వరకు కూడా దేవినేని ఉమ పోటీ చేస్తారని భావించారు. కాని తెర మీదకు మరో నేత రావడంతో.. ఇప్పుడు దేవినేని ఉమకు కొత్త కష్టాలు వచ్చినట్లు అయింది. వచ్చే ఎన్నికల్లో బొమ్మసాని సుబ్బారావు మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఆయన దేవినేని ఉమకు పోటీగా పోరాటాలు కూడా నిర్వహిస్తున్నారు. ఆ మధ్య మైలవరం నియోజకవర్గంలో బొమ్మసాని సుబ్బారావు అధ్యక్షతన ఓ కార్యకర్తలు కూడా నిర్వహించారు. దీనికి తోడు అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో దేవినేని ఉమ ఫోటో లేకపోవడంతో మరో వాదనకు దారి తీసింది. ముఖ్య అతిథిగా బొమ్మసాని సుబ్బారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ అందరిది.. అందరం కలిసి పని చేస్తే మళ్లీ నియోజకవర్గంలో టీడీపీ గెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఆయన ఎక్కడ కూడా దేవినేని ఉమ పలకపోవడం పలు అనుమానాలకు దారి తీసింది. ఇదిలా ఉంటే దేవినేని ఉమపై టీడీపీ కార్యకర్తలు కూడా గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.
దేవినేని ఉమ వల్లే నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ట మసకబారిందనే వాదన కూడా ఉంది. ఆయన తీరుతో చాలామంది పార్టీని వదిలిపెట్టారు. ఓడిపోయి మూడేళ్లు దాటిపోయినప్పటికి కూడా .. ఇప్పటికి మైలవరం నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు ఆయన ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. దీనికి తోడు ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఉమ చుట్టు ఉన్నవారెవ్వరు కూడా ఇప్పుడు పార్టీలో కనిపించకపోవడం కూడా తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. ఇవ్వన్ని గలగలిసి…బొమ్మసాని సుబ్బారావును మైలవరం రేసులోకి తీసుకువచ్చేలా చేశాయని వారంటున్నారు. దీనికి తోడు బొమ్మసాని సుబ్బారావుకే చంద్రబాబు సపోర్టు కూడా ఉందని పార్టీలో జోరుగా చర్చ సాగుతుంది. ఇదే కనుక జరిగితే మైలవరంలో దేవినేని ఉమ కథ క్లోజ్ అయినట్లే అని అనుకుంటున్నారు. గతంలో తనకు ఎమ్మెల్యేగా గెలవడానికి సాయపడిన బొమ్మసాని సుబ్బారావు.. ఇప్పుడు ఉమ సీటుకు ఎసరు పెట్టడం మైలవరం నియోజకవర్గంలో హాట టాపిక్‌గా మారింది. మరి మైలవరం నియోజకవర్గం రాబోవు రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.