వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి బాధితులను పరామర్శించేందుకు సిద్ధపడుతున్నారు. గత కొద్ది రోజులుగా రాయలసీమలో ఫ్యాక్షన్ హత్యలు వెలుగు చూస్తున్నాయి. కూటమి నేతల ప్రోత్సాహంతో దాడులు జరుగుతున్నాయి. ఈ తరుణంలో బాధిత వర్గాలను పరామర్శించేందుకు సిద్ధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి.
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్త లింగమయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఆయన కుటుంబ సభ్యులను జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. వారికి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు.
రాప్తాడు నియోజకవర్గం లోని రామగిరి మండలం పాపిరెడ్డి పల్లికి చెందిన లింగమయ్య ఇటీవల దారుణ హత్యకు గురయ్యాడు. టిడిపి నేతలే హత్య చేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో లింగమయ్య కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన గురించి ఆరా తీశారు.
ఉగాది నాడు కుటుంబ సభ్యులతో కలిసి లింగమయ్య గుడికి వెళ్లి వస్తుండగా దారి కార్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు దారుణ హత్య చేశారు. అప్పటినుంచి బాధిత కుటుంబం ఆందోళనతో ఉంది. వివరాలు సేకరించిన జగన్మోహన్ రెడ్డి అధైర్య పడవద్దని.. మీకు నేను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పార్టీ తరఫున న్యాయ సహాయం అందిస్తామని చెప్పుకొచ్చారు.
మరోవైపు మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నారు. త్వరలో రాప్తాడు నియోజకవర్గానికి వెళ్ళనున్నారు. మరోవైపు రాప్తాడులో కొద్ది రోజుల కిందట మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అడుగుపెట్టగా పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. ఇటువంటి సమయంలో పార్టీ శ్రేణులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. అందుకే రాప్తాడు లో అడుగు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ఖరారు అయ్యే అవకాశం ఉంది