Sunday, September 8, 2024

చంద్రబాబుకు బిగ్ షాక్.. ఈడీ నోటీసులు… విచారణకు రావాలంటూ ఆదేశాలు..?

- Advertisement -

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చారు ఈడీ అధికారులు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అంటే.. 2014 నుంచి 2019 కాలంలో జరిగిన అవకతవకలపై ఈడీ విచారణ చేపట్టింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జరిగిన అవినీతి బయటపడటంతో…దీనికి సంబంధించిన వ్యక్తులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. దీనిపై విచారణకు హాజరవ్వాల్సి ఉంటుందని..సంబంధిత వ్యక్తులకు ఈడీ అధికారులు తెలిపారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయంలో చాలానే కుంభకోణాలు జరిగాయని.. అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం జగన్ మొదటి నుంచి చెబుతునే ఉన్నారు.

తాజా దేశంలోని వివిధ దర్యాప్తు సంస్థలు.. అన్ని కూడా పలు అంశాల మీద విచారణను ప్రారంభించాయి. ఈక్రమంలోనే తెలంగాణ సీఎం కూతురు కవిత లిక్కర్ స్కాం బయటపడింది. ఆమెను విచారించడానికి సీబీఐ అధికారులు సిద్దం అవుతున్నారు. తాజాగా ఏపీలో ఇదే మాదిరి విచారణకు ఈడీ కూడా రెడీ అవుతుంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌‌లో భారీ స్కాం జరిగిందని ఈడీ అధికారులు గుర్తించారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌‌ స్కాంపై ఈడీ నోటీసులు జారీ చేసింది. స్కిల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ కు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ ఈడీ 26 మందికి నోటీసులు జారీ చేసింది.

2014-2019 సమయంలో కీలకంగా వ్యవహరించిన 26 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు వారు ఈడీ విచారణకు హాజరు కావాలని సూచించింది. మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ, మాజీ ఎండీ గంటా సుబ్బారావులతో పాటు అనేక మందికి నోటీసులు జారీ చేసింది. ఐటీశాఖకు అప్పట్లో నారాలోకేష్ మంత్రిగా ఉన్నారు. ఈరోజు వారు హైదరాబాద్ లో ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కార్పోరేషన్‌లో అనేక అక్రమాలు జరిగినట్లు ఈడీ ప్రాధమిక అంచనాకు వచ్చింది. ఆ సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో సీమెన్స్ సంస్థ 3,350 కోట్ల ఒప్పందం చేసుకుంది. అందులో 10 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా 370 కోట్లు.

ఈ ప్రభుత్వ వాటాలోని 370 కోట్లలో సుమారు 241 కోట్ల 78 లక్షల 61 వేల 508 రూపాయలు దారి మల్లినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో నిధుల మల్లింపు విషయాన్ని నిర్ధారించారు. ఏపీ ప్రభుత్వం నుండి 370 కోట్లు బిల్లులు తీసుకున్న సిమెన్ సంస్థ జీఎస్టీని కూడా ఎగ్గొట్టింది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో సీఐడీ విచారణ చేపట్టిన ఈ కేసులో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిలో సిఎ విపిన్‌కుమార్ శర్మ, అతని భార్య నీలం శర్మలను అరెస్ట్ చేశారు. నిధుల మళ్లింపు జరిగినట్లు ఈడీ పక్కా ఆధారాలు సేకరించడంతోనే.. సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ స్కిల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ గత చంద్రబాబు హయాంలో ఏర్పాటయిందే. ఇది ఐటీ శాఖ కిందకు వస్తుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ ఏర్పాటు చేసినప్పుడు ఐటీ శాఖకు నారా లోకేష్‌కు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు విచారణ తరువాత నారా లోకేష్‌కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!