Sunday, September 8, 2024

కవితకు సపోర్టుగా జగన్..ఏకంగా ఎంపీనే రంగంలోకి దించారుగా..!

- Advertisement -

కవితకు అండగా రంగంలోకి జగన్..పార్టీ ఎంపీనే బరిలోకి దింపారుగా

ఏపీ సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అండగా నిలబడుతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో పాగా వేసే నేపథ్యంలో బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులు ఇరువురు కూడా కత్తులు దూసుకుంటున్నారు. దీనిలో భాగంగానే లిక్కర్ స్కాం ఒకటి అనుహ్యంగా తెర మీదకు వచ్చింది. ఈ స్కాంలో చాలా మంది ప్రముఖుల పేర్లు వినిపించాయి. అందులో ఒకటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు పేరుతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు కూడా బయటకు వచ్చింది.

ముఖ్యంగా కవితను టార్గెట్ చేస్తు బీజేపీ నాయకులు విమర్శలు కూడా చేస్తున్నారు. ఆమెను ఎలాగైనా జైలుకు పంపించాలనే ఉద్దేశంతో బీజేపీ నాయకులు ఉన్నారని టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే కవిత ఈ కేసు నుంచి బయటపడటానికి వైసీపీ ఎంపీ ఒకరు సాయం చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఆ వైసీపీ ఎంపీ మరెవ్వరో కాదు…నిరంజన్ రెడ్డి. వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులు అన్ని కూడా నిరంజన్ రెడ్డినే వాదిస్తున్నారు. జగన్ మీద మోపబడిన కేసులన్ని కూడా ఒక్కొక్కటి తొలగిపోవడంతో.. జగన్ ఆయనకు రాజ్యసభను సీటును ఇచ్చి గౌరవించారు. వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డినే తమ కేసును కూడా వాదించాలని పట్టుపడుతున్నారట టీఆర్ఎస్ నేతలు.

వకీలు‌గా మంచి నాలెడ్జ్‌తో పాటు, ఢిల్లీలో చక్రం తిప్పగల సమర్థుడు కాబట్టే ఆయన్ను తమ తరుఫును కోర్టులో వాదించాలని కవిత వర్గం కోరుకుంటుంది. ఇటు జగన్ కూడా కవిత తరుఫున వాదించడానికి తమ ఎంపీ నిరంజన్ రెడ్డికి గ్నీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కవిత ఈ లిక్కర్ స్కాం నుంచి బయటపడితే.. తమ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడుపై కూడా ఎటువంటి అవినీతి మచ్చలు లేకుండా ఉంటుందని భావిస్తున్నారట. అందుకే కవితకు మద్దతుగా తమ ఎంపీని రంగంలోకి దించినట్లుగా సమాచారం. దీనిని బట్టి చూస్తే కవితను లిక్కర్ స్కాం నుంచి బయటపడేయడానికి వైసీపీ ఎంపీ కంకణం కట్టుకున్నట్లే కనబడుతుంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!