Wednesday, October 16, 2024

వైఎస్ఆర్‌ను తప్పుదోవ పట్టించిన సీనియర్ మంత్రి ఆయనేనా..? హెలికాఫ్టర్ ప్రమాదం ఆయన వల్లే అంటూ సంచలన విషయాలను బయటపెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ శ్రేణుల ఆరాధ్యదైవం అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం గురించి తాజాగా మరో వాదనను తెర మీదకు తీసుకువచ్చారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. వాతవరణం బాలేకపోయినప్పటికి కూడా వైఎస్ఆర్ హెలికాఫ్టర్‌లో ప్రయాణించేలా ప్లాన్ చేసింది ఆ సీనియర్ మంత్రే అంటూ కిరణ్ కుమార్ రెడ్డి. షాకింగ్ కామెంట్స్ చేశారు. దానిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ హీరో బాలకృష్ణ హోస్ట్‌‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాప్‌బుల్‌కు మాజీ కిరణ్ కుమార్ రెడ్డి , మాజీ స్పీకర్ సురేష్ బాబు ఇద్దరు కూడా గెస్ట‌ులుగా వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా వ్యక్తిగత విషయాలతో పాటు, రాజకీయాల గురించి కూడా చర్చించుకోవడం జరిగింది. ఈ సమయంలో సీఎం ఎలా అంటూ బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు కిరణ్ కుమార్ రెడ్డి సమాధానం ఇస్తూ…కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకునే ప్రయత్నం చేశారు.

తన మీద వైఎస్ఆర్‌కు ఓ సీనియర్ మంత్రి తప్పుగా చేప్పేవారని.. అందుకే తనకు ఆయన క్యాబినెట్‌లో కీలక పదవి రాలేదని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా వైఎస్ఆర్‌ను మరో సీనియర్ మంత్రి తప్పుదోవ పట్టించారని..దాని కారణంగానే ఈరోజు వైఎస్ఆర్ మన మధ్య లేరని కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వైఎస్ఆర్ ప్రయాణించాల్సిన హెలికాఫ్టర్‌లో తాను కూడా వెళాల్సి ఉంది అని కాని చివరి నిమిషాంలో తప్పుకున్నానని ..తాను బతికి ఉండటం వల్లనే సీఎం అయ్యానని ఆయన తెలిపారు. ఆరోజు వైఎస్ వెంట హెలికాప్టర్ లో వెళ్లాల్సి ఉండగా చివరి నిమిషంలో రద్దయినట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. తాను వెళ్లకపోవడం వల్లనే బతికిపోయాని, అందుకే సీఎం కాగలిగానని ఆయన వ్యాఖ్యానించారని ప్రోమోను బట్టి అర్థమవుతుంది.

అయితే కిరణ్ కుమార్ రెడ్డి గురించి వైఎస్ఆర్‌కు తప్పుగా చెప్పింది… ప్రస్తుత వైసీపీ కీలక నేత మంత్రి పెద్దిరెడ్డి అని చర్చించుకుంటున్నారు. ఒకే పార్టీలో ఉన్నప్పటికి కూడా కిరణ్ కుమార్ రెడ్డికి, పెద్దిరెడ్డికి మధ్య అసలు పడేది కాదని.. జిల్లాలో అధిపత్యం కోసం ఇరు వర్గాలు కూడా పోటీ పడేవని తెలుస్తుంది. వైఎస్ఆర్‌కు తన గురించి చెప్పి.. అప్పట్లో మంత్రి పదవి రాకుండా చేశారని కిరణ్ కుమార్ రెడ్డి మాటలను బట్టి అర్థం అవుతుంది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కూడా కిరణ్ కుమార్ రెడ్డి టీడీపీ నాయకుల గెలుపు కోసం కృషి చేశారనే టాక్ ఉంది. ఆయన తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో కొనసాగుతున్న సంగతి అందరికి తెలిసిందే. గత రెండు పర్యాయాలు కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహాలు ఫెయిల్ అయ్యాయి. మరి ఈసారి అయిన ఆయన వ్యూహాలు ఫలిస్తాయో లేదో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!