Tuesday, September 10, 2024

అడ్డంగా బుక్కైన భూమా అఖిల ప్రియ..! ఈసారి గట్టెక్కడం కష్టమే

- Advertisement -

టీడీపీ మహిళ నేత, మాజీ మంత్రి అయిన భూమా అఖిల ప్రియ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే వరుస సమస్యలతో సతమతం అవుతున్న భూమా అఖిల ప్రియ.. తాజాగా మరోసారి చిక్కుల్లో పడినట్లుగా తెలుస్తోంది. ఆమెకు బ్యాంకు అధికారులు నోటిసులు ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..భూమా అఖిల ప్రియ ఏపీ , తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా పరిచియం అక్కర్లేని పేరు ఇది. పార్టీ ఓడిపోయి కష్టకాలంలో జగన్‌కు అండగా ఉండాల్సిన సమయంలో జగన్‌ను కాదని పదవులు కోసం భూమా ఫ్యామిలీ అప్పటి అధికార టీడీపీ పార్టీలో చేరిన సంగతి అందరికి తెలిసిందే. .భూమా అఖిల ప్రియ తల్లి చనిపోతే ఎమ్మెల్యే పదవిని తండ్రి చనిపోతే మంత్రి పదవిని అలకరించడం జరిగింది. ఇక 2019లో రాష్ట్రం మొత్తం కూడా జగన్ గాలి వీచింది.

ఈ ఎన్నికల్లో మహమహులంతా కూడా ఓడిపోయారు. భూమా ఫ్యామిలీ కూడా జగన్ ప్రభావాన్ని తట్టుకోలేకపోయింది. ఓడిపోయిన తరువాత ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన అఖిల ప్రియ ..175 నియోజిక వర్గాల్లో జగన్ ఒక్కడే నిలబడితే ఎలా గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంతలా జగన్ ఇంపాక్ట్ ఉందని ఆమె ఒప్పుకున్నారు. ఓడిపోయిన తరువాత అఖిల ప్రియ వరుస కష్టాలు అనుభించారు.

హైదరాబాద్ హఫీజ్‌పేట్‌లోని 25 ఎకరాల భూమికి సంబంధించిన కేసులో అఖిల ప్రియ కొన్నాళ్లు జైలు జీవితం కూడా గడిపారు. అయితే ఆ సమయంలో భూమా అఖిలప్రియ అండగా ఏ ఒక్క టీడీపీ నాయకుడు కూడా స్పందిచింది లేదు. ఆమె గురించి మాట్లాడితే ఎక్కడ ఏం ముంచుకు వస్తుందో అని తెగ భయపడిపోయారు. తరువాత ఆమె బెయిల్ మీద బయటకు వచ్చారు. అయినప్పటికి నిత్యం కుటుంబానికి సంబంధించిన ఏదో ఒక విషయంలో అఖిల ప్రియ పేరు వినిపిస్తునే ఉంది.

తాజాగా మరోసారి ఆమె పేరు ఓ వివాదంలో తెర మీదకు వచ్చింది. బ్యాంకులో తనఖా పెట్టిన భూమిని ప్లాట్‌లు మార్చి అమ్మేశారని అఖిల ప్రియకు బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. ప‌దేళ్ల క్రితం త‌న‌ఖా పెట్టిన భూమిని చ‌క్క‌గా ప్లాట్లు వేసి, వాటిని విక్ర‌యించి అఖిల‌ప్రియ సొమ్ము చేసుకున్నారు. బ్యాంక్‌లో త‌న‌ఖా పెట్టిన విష‌యం తెలియ‌కుండా స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో మేనేజ్ చేసిన‌ట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆమెను అఖిల‌ప్రియను ప్రశ్నిస్తే.. ఆమె బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. దీనిపై స్పందించిన బ్యాంకు అధికారులు .. సదరు భూమిని తిరిగి కైవసం చేసుకున్నామని తెలిపారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..బ్యాంక్ స్వాధీనం చేసుకున్న భూమిలోనే భూమా దంప‌తుల స‌మాధులు కూడా ఉన్నాయట. అంతటి దీనస్థితికి అఖిల ప్రియ జారిపోయిందని అక్కడ ప్రజలు చర్చించుకుంటున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!