తెలుగు ఇండస్ట్రీలో మరో ధృవతార నింగికి ఎగిసింది. ఘట్టమనేని కృష్ణ మంగళవారం ఉదయం మరణించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సోమవారం ఉదయం కృష్ణకు గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు కాంటినెంటల్ హాస్సిటల్‌లో చేర్పించారు. కృష్ణ ఆరోగ్యం విషమంగానే ఉందని చెప్పిన డాక్టర్లు మరో 48 గంటలు దాటితో కాని చెప్పలేమని తెలిపారు. అయితే మంగళవారం ఉదయం 4 గంటలకు కృష్ణ తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కృష్ణ మరణవార్త తెలియగానే.. తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా శోకసంధ్రంలో మునిగిపోయాయి. ముఖ్యంగా కృష్ణ అభిమానులు ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి లేని అభిమానగణం కృష్ణకు మాత్రమే సొంతం. ఆయనకు 1980లలోనే 250పైగా అభిమాన సంఘాలు ఉండేవి.
ఎన్టీఆర్‌కు అభిమానులు ఎక్కువుగానే ఉన్నప్పటికి కూడా కృష్ణ అభిమానులతో పోలిస్తే అది తక్కువే అని చెప్పాలి. అందుకే ఇప్పటికి కూడా కృష్ణ తనయుడు మహేష్ బాబు తన సినిమాల స్పీచ్‌లలో నాన్నగారి అభిమానులు, నా అభిమానులు అంటూ ప్రత్యేకించి మాట్లాడుతుంటారు. అలాంటి అభిమానులను తన సొంతం చేసుకున్నారు కృష్ణ. ఇదిలా ఉంటే రాజకీయాలలో కూడా కృష్ణ తనదైన ముద్ర వేశారు. అప్పట్లో సినిమా ఇండస్ట్రీ అందరు కూడా ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరుతుంటే…కృష్ణ మాత్రం.. దీనికి భిన్నంగా ఇందిరా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఏలూరు ఎంపీగా కూడా గెలిచారు. దివంగత సీఎం వైఎస్ఆర్‌తో కృష్ణకు వీడదీయరాని సంబంధాలు ఉన్నాయి.
వీరిద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీలో కలిసి పని చేశారు. తరువాత కొన్నాళ్లకు కృష్ణ క్రియశీల రాజకీయల నుంచి తప్పుకున్నారు. వైఎస్ఆర్ మరణం తరువాత కృష్ణ – విజయనిర్మల దంపతులు వైసీపీ అనుకులంగా మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ సందర్భంలో కృష్ణ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ తనయుడుగా జగన్‌కు ఎనలేని క్రేజ్ ఉందని.. జగన్ చేస్తున్న పాదయాత్రకు మంచి స్పందన వస్తుందని.. తమ మద్దతు జగన్‌కే ఉంటుందని తెలిపారు. జగన్ సీఎం కావాలని తాము కూడా ఆకాంక్షిస్తున్నట్లుగా కృష్ణ – విజయనిర్మల దంపతులు వెల్లడించారు. ఇక అటు కృష్ణ అభిమానులు కాని ఇటు మహేష్ అభిమానులు కాని ఎక్కువుగా వైసీపీకే మద్దుతుగా నిలుస్తున్నారు. కృష్ణ మరణవార్తపై సినిమా వర్గాలతో పాటు, రాజకీయ వర్గాలు కూడా తమ సంతపంను వ్యక్తం చేస్తున్నాయి.