Wednesday, March 19, 2025

టిడిపిలో తీవ్ర అసంతృప్తితో మేకపాటి.. జగన్ నయం అంటున్న చంద్రశేఖర్ రెడ్డి!

- Advertisement -

ఆయన ఓ రాజకీయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చారు. ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే ఎమ్మెల్యే అయ్యారు. నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై రికార్డ్ సృష్టించారు. కానీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పేరుకే అధికార పార్టీ కానీ.. ఎటువంటి పదవులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు.

నెల్లూరు జిల్లా అంటే ముందుగా గుర్తుకొచ్చేది మేకపాటి కుటుంబం. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న ఆ కుటుంబం నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, మేకపాటి విక్రం రెడ్డి వంటి నేతలు పదవులను అలంకరించారు. జిల్లాలోని తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది ఆ కుటుంబం. కానీ ఇప్పుడు గట్టు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆ కుటుంబం చెరో పార్టీలో ఉంది.

మేకపాటి రాజమోహన్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి. దాదాపు 16 నెలల ఎమ్మెల్యే పదవిని వదులుకొని టిడిపికి దగ్గరయ్యారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి విభేదిస్తూ ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో చేరిన చంద్రశేఖర్ రెడ్డికి ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. కనీసం నామినేటెడ్ పదవి దక్కలేదు. ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేరిన నేతలందరికీ టిక్కెట్లు దక్కాయి. నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేంరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇలా అంతా వైసిపి నుంచి టిడిపిలో చేరారు. కానీ వారితో పాటు చేరిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మాత్రం ఎటువంటి అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు.

వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు చంద్రశేఖర్ రెడ్డి. 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అటు తరువాత 2004, 2009లో వరుసగా గెలిచారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ 2023 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో టీడీపీకి దగ్గరైన ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు చంద్రశేఖర్ రెడ్డి. తగినంతగా ప్రాధాన్యం లేదు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వద్ద తనకు గుర్తింపు లభించింది కానీ.. అనవసరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడానని లోలోపల బాధపడుతున్నారు. టిడిపిలో అసంతృప్తిగానే కొనసాగుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!