Tuesday, April 22, 2025

పోసాని కృష్ణ మురళి పొలిటికల్ రీ ఎంట్రీ?

- Advertisement -

పోసాని కృష్ణ మురళి తిరిగి పొలిటికల్ గా యాక్టివ్ కావాలని భావిస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల కిందట ఆయన క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని.. ఇకనుంచి రాజకీయాలు మాట్లాడనని కూడా చెప్పుకొచ్చారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివయ్యేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.

కమ్మ సామాజిక వర్గానికి చెందిన పోసాని కృష్ణమురళి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి జై కొట్టారు. ఆయన అభిమానిగా మారిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతు దారుడిగా నిలిచారు. అందుకే 2019లో వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని కృష్ణ మురళి కి కీలక పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా పదవి ఇచ్చి గౌరవించారు.

వాస్తవానికి ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పోసాని కృష్ణ మురళి. పి అర్ పి ద్వారా 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ బాట పట్టి కీలకమైన పదవి పొందగలిగారు. అయితే జగన్మోహన్ రెడ్డి పట్ల వీర విధేయత చూపే క్రమంలో ఆయన రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. వ్యక్తిగత కామెంట్లకు దిగారు. దానికి పర్యవసానాలు ఇప్పుడు అనుభవించారు. ఆయన చుట్టూ కేసులు చుట్టుముట్టాయి. రోజుల తరబడి జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అయితే ఇంకా కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. విచారణకు హాజరు కావాల్సి ఉంది.

ఎన్నికల ఫలితాల అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పోసాని స్టేట్మెంట్లు ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం ఆయనపై కేసులతో విరుచుకు పడుతుందని తెలుసుకుని రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే అంతటితో తనపై కేసులు నమోదు చేయరని ఆయన భావించారు. కానీ కూటమి ప్రభుత్వం క్షమించలేదు. వరుసగా కేసులు పెట్టింది. కస్టడీల మీద కస్టడీలు కొనసాగాయి. సుమారు 26 రోజులు పాటు పోసాని జైలులో ఉండి పోవాల్సి వచ్చింది.

అయితే పోసానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. న్యాయ సహాయం కూడా అందించింది. కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. అయితే ఇప్పుడు తనపై నమోదైన కేసుల దృష్ట్యా రాజకీయ అండ ఉండాలని భావిస్తున్నారు పోసాని కృష్ణ మురళి. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే రాజకీయాల నుంచి తప్పుకున్నానని ప్రకటించిన పోసానికి.. తప్పకుండా పాలిటిక్స్ లో ఉండాల్సిన అనివార్య పరిస్థితి ఎదురయింది. ఆ పరిస్థితిని కల్పించింది కూటమి ప్రభుత్వం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!