చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారా? జగన్మోహన్ రెడ్డి అనుకూలూరును వ్యతిరేకులుగా మార్చేశారా? జగన్మోహన్ రెడ్డికి విధేయులైన నేతలపై దృష్టి పెట్టారా? వారిని తమ వైపు తిప్పుకున్నారా? వారితోనే జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయనున్నారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే ప్రశ్న వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
జగన్మోహన్ రెడ్డి నుంచి విజయసాయిరెడ్డిని వేరు చేయవచ్చు అని ఎవరైనా ఊహించరా? జగన్మోహన్ రెడ్డిని విజయసాయిరెడ్డి విభేదిస్తారని ఎవరైనా కలలో కూడా అనుకున్నారా? కానీ విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. ఇప్పుడు అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ది బదనాం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఒక్క విజయసాయి రెడ్డి కాదు.. సోము వీర్రాజు లాంటి నేతలను సైతం తన రూట్లోకి తెచ్చుకున్నారు చంద్రబాబు. చంద్రబాబుతో పాటు టిడిపిని టార్గెట్ చేసుకునేవారు సోము వీర్రాజు. బిజెపి ఏపీ చీఫ్ గా ఉండేటప్పుడు కేవలం చంద్రబాబు పై మాత్రమే తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రసక్తి లేదని అప్పట్లో తేల్చి పారేశారు.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సోమ వీర్రాజు కూడా టికెట్ ఆశించారు. కానీ చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి టికెట్ ఇవ్వలేదు. కేవలం బిజెపిలో ఉన్న టిడిపి బ్యాచ్ కు మాత్రమే టికెట్లు దక్కాయి. సోము వీర్రాజు తోపాటు విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలను పక్కన పెట్టారు. జీవీఎల్ నరసింహం పేరు అయితే కనీసం పరిగణలోకి తీసుకోలేదు. అయితే కూటమి పాలన 10 నెలలు పూర్తయిన తర్వాత సోము వీర్రాజు విషయంలో చంద్రబాబు ఒక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు చంద్రబాబు. అయితే దీని వెనక చాలా కథ నడిచినట్లు సమాచారం.
ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత సోము వీర్రాజు టోన్ లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబును పొగుడుతూ.. జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో వీరుచుకుపడ్డారు సోము వీర్రాజు. తద్వారా ఈ ఆరేళ్లపాటు సోము వీర్రాజును జగన్మోహన్ రెడ్డి పై ప్రయోగించనున్నారు అన్నమాట. ఒకప్పుడు చంద్రబాబు అంటేనే విరుచుకు పడిపోయే సోము వీర్రాజును పదవి ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి పై చంద్రబాబు వదులుతుండడం నిజంగా గొప్ప విషయమే. రాజకీయం అంటే ఇలా ఉంటుందా అనే రీతిలో చంద్రబాబు పావులు కడుపుతుండడం మాత్రం చిన్న విషయం కాదు.