Saturday, April 27, 2024

చంద్రబాబును దెబ్బతీయడమే గంటా టార్గెట్…వారందరితో కలిసి వైసీపీలోకి…?

- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు … అధికార పార్టీ వైసీపీలో చేరడానికి రంగం సిద్దం అవుతుంది. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. డిసెంబర్‌లో గంటా శ్రీనివాసరావు జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశం ఉంది. గంటా ఇప్పటికే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖ ఉక్కు ప్రైవైట్‌పరం చేయొద్దంటూ.. నిరసన వ్యక్తం చేస్తూ గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి.. తన రాజీనామా పత్రాన్ని ఇప్పటికే.. స్పీకర్‌కు పంపించారు. దీంతో గంటా శ్రీనివాసరావు ఆఫీషియల్‌గా వైసీపీలో చేరిన వచ్చే ఇబ్బంది లేదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరిన తరువాత చంద్రబాబును దెబ్బతీయడమే ఆయన టార్గెట్‌గా తెలుస్తోంది.

అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పులతో పాటు, ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు ఫెయిల్ అయ్యారని నిరుపించడానికి గంటా శ్రీనివాసరావు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ మూడున్నరేళ్లలో ప్రజల తరుఫున చంద్రబాబు చేసిన పోరాటాలు ఏమిటో చెప్పాలని చంద్రబాబును గంటా శ్రీనివాసరావు నిలదీయనున్నారట. అసలు 2019 ఎన్నికల ముందే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతారని అందరు భావించారు. కాని ఆయన అనుచరుడు అవంతి శ్రీనివాసరావు వైసీపీలోకి వెళ్లడంతో గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే కొనసాగారు. తాజాగా గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరాలని ఫిక్స్ అవ్వడం.. దానికి వైసీపీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్రల్ ఇవ్వడంతో… గంటా రూట్ క్లియర్ అయింది.

అయితే గంటా శ్రీనివాసరావు తనతో పాటు.. మరికొందరిని కూడా టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకువెళ్తారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే గంటా అనుచరులంతా కూడా వైసీపీలో చేరిపోయారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యేలను కూడా వైసీపీలోకి తీసుకువెళ్లడానికి గంటా శ్రీనివాసరావు ప్లాన్ వేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత , ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ,చోడవరం మాజీ టీడీపీ ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ రాజు కూడా గంటాతో పాటే వైసీపీ కండువా కప్పుకుంటారు అని అంటున్నారు. ఇదే కనుక జరిగితే టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి. మరి నాయకుల రాకను చంద్రబాబు ఎలా అడ్డుకుంటారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!