ఏపీ సీఎం , వైసీపీ అధినేత జగన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. తండ్రి ఇచ్చిన రాజకీయ వారసత్వంతో పాటు తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జగన్‌కు చాలామంది అభిమానులు ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్‌లో జగన్‌ను అభిమానించే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. అయితే తన రాజకీయ బీజీ షెడ్యూల్ వల్లన జగన్ హైదరాబాద్ రావడం లేదు. ఆయన చాలాకాలం తరువాత హైదరాబాద్‌కు రావడం జరిగింది.
సూపర్ స్టార్ కృష్ణ మృతిపై ఆయన సంతాపం వ్యక్తం చేయడానికి జగన్ హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను ఓసారి చూస్తే.. కనుక .. తెలంగాణలో కూడా జగన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనిపిస్తుంది. జగన్ హైదరాబాద్‌లో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా అభిమానులు ఆయన వెంట నడిచారు. ఇక కృష్ణ ఇంటికి చేరుకునే క్రమంలో అయితే జగన్ కారును అభిమానులు ముందుకు కూడా కదలనివ్వలేదు. కృష్ణకు నివాళులు అర్పించిన తరువాత .. మహేష్ కుటుంబ సభ్యులతో జగన్ కాసేపు మాట్లాడారు. జగపన్ వచ్చిన సంగతి తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య సైతం మీడియా సమావేశాన్ని ముగించుకుని..జగన్‌ను చూడటానికి వచ్చారు.
మహేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సమయంలో బాలయ్యను చూసిన జగన్ ఆయనకు నమస్కరించారు. అటు బాలయ్య కూడా చిరునవ్వుతో జగన్‌ను పలకరించారు. ఇదే సమయంలో బాలయ్య కూతురు నారా బ్రహ్మణి కూడా అక్కడే ఉండటం విశేషంగా మారింది. నారా బ్రహ్మణి కూడా జగన్‌ను చూడటం కెమెరా కంటికి చిక్కడం కనిపించింది. ఇక టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా జగన్‌తో కాసేపు ముచ్చటించారు. ముభావంగా ఉన్న గల్లా అరుణకుమారిని సైతం పలకరించారు జగన్. ఇలా జగన్ పర్యటన ఆద్యంతం కూడా ఆసక్తికరంగా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చినప్పుడు కూడా హంగామా లేదని మీడియా వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏది ఏమైనా జగన్ క్రేజ్‌కు ఎవరైనా ఫిదా అవాల్సిందే… అది బ్రహ్మాణి అయిన బాలయ్య అయిన సరే అంటూ వైసీపీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు