సూపర్‌స్టార్ కృష్ణ మరణం… హుటాహూటిన మహేష్ బాబు ఇంటికి బయలుదేరిన జగన్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం మరణించారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. ఈ రోజు తెల్లవారు జామున కృష్ణ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గుండెపోటుతో కాంటినెంటల్ హాస్సిటల్ లో చేరిన కృష్ణ తుది శ్వాస విడిచారు. కృష్ణ మరణంతో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయంది. కృష్ణ మృతి పట్ల అటు రాజకీయ నాయకులు కూడా స్పందిస్తున్నారు. కేసీఆర్, వెంకయ్య నాయుడు, వంటి వారు కృష్ణ మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. తాజాగా కృష్ణ మృతిపై ఏపీ సీఎం జగన్ కూడా సంతాపం వ్యక్తం చేశారు.
నిర్మాతగా, దర్శకుడిగా, నిర్మాణ సంస్థ నిర్వహించిన సూపర్ స్టార్ కృష్ణ ఐదు దశాబ్దాల పాటు సినీ ప్రపంచంలో అందించిన సేవలను గుర్తు చేసుకున్న సీఎం కేసీఆర్ విలక్షణ నటుడు కృష్ణ అని కొనియాడారు. 350కి పైగా సినిమాలలో నటించిన సినీ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన కృష్ణ మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటని సీఎం జగన్ పేర్కొన్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం…సూపర్‌స్టార్ కృష్ణ పార్థివ దేహనికి జగన్ నివాళులు అర్పిస్తారని తెలుస్తోంది. వైఎస్ జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో కృష్ణకు విడదీయరాని సంబంధం ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీలో కలిసి పని చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆ అనుబంధంతోనే జగన్ కృష్ణ అంత్యక్రియాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.