Wednesday, March 19, 2025

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి జగన్ పిలుపు.. భవిష్యత్తుపై భరోసా.. యాక్టివ్ గా యువనేత!

- Advertisement -

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యువజన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. చిన్న వయసులోనే తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు సిద్ధార్థ రెడ్డి. కానీ ఈ ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయ్యారు. గతంలో అధినేత జగన్మోహన్ రెడ్డి పై ఈగ వాలనిచ్చేవారు కాదు. అటువంటి సిద్ధార్థ రెడ్డి సైలెంట్ కావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి. అందుకే అధినేత జగన్మోహన్ రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ప్రత్యేకంగా పిలిపించుకున్నట్లు సమాచారం. భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇస్తానని.. నాది భరోసా అంటూ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కర్నూలులో యాక్టివ్ అవుతారని సమాచారం.

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ది రాజకీయ నేపధ్య కుటుంబం. ఆయన తాత బైరెడ్డి శేషశయన రెడ్డి తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మంత్రి పదవి కూడా చేపట్టారు. చనిపోయే వరకు ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. సిద్ధార్థ రెడ్డి పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సైతం తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఎమ్మెల్యేగా కూడా సేవలందించారు. అయితే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వారసుడిగా తెరపైకి వచ్చారు సిద్ధార్థ రెడ్డి. 2019 ఎన్నికలకు ముందు పెదనాన్న రాజశేఖరరెడ్డి తో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మంచి చరిస్మ ఉన్న నాయకుడిగా ఎదిగారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్స్ ను ఏర్పాటు చేసుకున్నారు. భాష పై మంచి పట్టు.. వాక్దాటితో ప్రజల్లోకి కూడా బలంగా వెళ్లారు. 2019 ఎన్నికల్లో రిజర్వ్డ్ నియోజకవర్గమైన నందికొట్కూరులో వైయస్సార్ గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు. అటు తరువాత వచ్చిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేశారు. జగన్మోహన్ రెడ్డి సైతం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సేవలను గుర్తించి శాప్ చైర్మన్గా ఆయనకు అవకాశం ఇచ్చారు. గత ఐదేళ్లలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకు పడడంలో ముందుండే వారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. కానీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేసరికి ఫుల్ సైలెంట్ అయ్యారు.

అయితే అధినేత జగన్మోహన్ రెడ్డి పిలిచి ఏకాంతంగా చర్చలు జరిపారు. భవిష్యత్తుపై కీలక హామీలు ఇచ్చారు. దీంతో ఈ యువ నేత యాక్టివ్ అయ్యేందుకు సిద్ధపడుతున్నారు. అదే జరిగితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ప్రత్యేక సోషల్ మీడియా విభాగం ఉంది. ఆయనకంటూ జిల్లా వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో యాక్టివ్ రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు. మున్ముందు మరింతగా క్రియాశీలకం కానున్నారు. అదే జరిగితే కర్నూలు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టు పెంచుకునే అవకాశం ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!