Sunday, October 13, 2024

రాజశేఖర్‌ రెడ్డి గొప్పతనాన్ని వివరిస్తూ ఎమోషనల్‌ అయిన బాలయ్య!

- Advertisement -

వైఎస్ఆర్ గొప్పతనం గురించి బాలయ్య మాటాల్లో

రాజశేఖర్‌ రెడ్డి ఒక గొప్ప నాయకుడు – బాలకృష్ణ

ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా పని చేశారు. ఇద్దరు కూడా ఒకే కాలానికి చెందినవారే అయినప్పటికి కూడా .. ఎవరికి వారు… తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ సినిమా హీరోగా వచ్చి..టీడీపీ స్థాపించి.. సీఎం కాగ… వైఎస్ఆర్ ఎన్టీఆర్ మ్యానియాలో కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించి తన స్టామినా ఏమిటో నిరుపించారు. మహసముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీని ఒకతాటి మీదకు తీసుకువచ్చి.. పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చేలా చేశారు. ప్రస్తుతం వీరిద్దరు కూడా లేకపోయినప్పటికి కూడా…వీరి ఇంకా ప్రజల్లో బ్రతికే ఉన్నారు.

ప్రస్తుతం వీరిద్దరు కూడా రెండు రాజకీయ పార్టీలకు ప్రతినిధ్యం వహిస్తున్నారు. ఎన్టీఆర్ పేరు చెప్పుకుని…టీడీపీ.. వైఎస్ఆర్ పేరు చెప్పుకుని వైసీపీ పార్టీలు తమ రాజకీయాలను కొనసాగిస్తున్నాయి. ఎన్టీఆర్ గొప్ప నాయకుడని టీడీపీ నాయకులు అంటుడుండగా, లేదు వైఎస్ఆర్ గొప్ప నాయకుడని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా వైఎస్ఆర్ గొప్పతనం గురించి టీడీపీ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ చెప్పడం సంచలనంగా మారింది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ షోకు ఎంతటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో.. రెండో సీజన్‌‌ను ఇటీవల ప్రారంభించారు. మొదటి సీజన్‌ను భిన్నంగా… రెండో సీజన్‌ను తీర్చిదిద్దారు. రెండో సీజన్‌లో సినీ నటులతో పాటు, రాజకీయ ప్రముఖులను కూడా ఆహ్వానిస్తు షోకు మరింత రేటింగ్‌ను తీసుకువచ్చేలా ప్లాన్ చేశారు. దీనిలో భాగంగానే మొదటి ఎపిసోడ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించగా..తాజాగా ఉమ్మడి ఏపీ సీఎం అయిన కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ వైఎస్ఆర్ గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి గురించి బాలకృష్ణ ప్రస్తావించారు. ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ బాలయ్య కూడా ఎమోషనల్‌ అయ్యారు. రాజశేఖర్‌ రెడ్డి ఒక గొప్ప నాయకుడు అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!